వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు

Senior Leader Dadi Veerabadra Rao Resign to YCP,Senior Leader Dadi Veerabadra Rao,Dadi Veerabadra Rao Resign,Veerabadra Rao Resign to YCP,YCP, CM Jagan, Dadi Veerabadra rao, AP Politics,Mango News,Mango News Telugu,Dadi Veerabhadra Rao Quits YSRCP,After Alla Ramakrishna Reddy,YSRCP Ignores Dadi Veerabhararao,Dadi Veerabadra Rao Latest News,Dadi Veerabadra Rao Latest Updates,Dadi Veerabadra Rao Live News,CM Jagan Live Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
YCP, CM Jagan, Dadi Veerabadra rao, AP Politics

అసెంబ్లీ ఎన్నికలవేళ అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తుంటే.. మరోవైపు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం జగన్‌కు హెడ్‌ ఏక్‌గా మారింది. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి.. తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. ఇటీవల ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా వైసీపికి.. తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. ఆమె వెంటే నడుస్తానని ఆర్కే ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు.

సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా అసంతృప్టిగా ఉన్న వీరభద్రరావు.. వైసీపీని వీడుతారని ముందుగానే ఊహాగాణాలు వినిపించాయి. ఈక్రమంలో ఊహాగాణాలకు చెక్ పెడుతూ పార్టీకి రాజీనామా చేశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్‌లు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు.. సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డిలకు పంపించారు.

2013లో వీరభద్రరావు తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌కు వైసీపీ విశాఖ పశ్చిమ టికెట్‌ను కట్టబెట్టింది. కానీ ఆ ఎన్నికల్లో రత్నాకర్ రావు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకు దాడి కుటుంబ వైసీపీలో నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత తిరిగి 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరభద్రరావు తన ఇద్దరు కుమారులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే ఆ ఎన్నికల సమయంలో వీరభద్రరావు అనకాపల్లి టికెట్ ఆశించారు. కానీ వీరభద్రరావును కాదని జగన్.. గుడివాడ అమర్నాథ్‌కు ఆ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అమర్నాథ్ విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికీ జగన్ పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుంచి వీరభద్రరావు నిరాశతో.. అసంతృప్తితో ఉన్నారు. ఇక త్వరలో జరగబోయ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా అనకాపల్లి టికెట్ తన కొడుకు రత్నాకర్‌కు కేటాయించాలని జగన్‌ను వీరభద్రరావు కోరారు.

అయితే ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీ భీశెట్టి సత్యవతిని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారట. సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ను చోడవరం నుంచి పోటీ చేయించనున్నారు. అయితే చివరి నిమిషం వరకు కూడా వీరభద్రరావు టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ జగన్ పక్కకు పెట్టేశారట. దీంతో అసంతృప్తితో ఉండలేక వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిణామాల మధ్య దాడి వీరభద్రరావు ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 4 =