వేమిరెడ్డిని విజయసాయిరెడ్డి ఢీ కొట్టగలరా?

Can Vijayasai Reddy Beat Vemireddy Prabhakarreddy, Vijayasai Reddy Beat Prabhakarreddy, Vijayasai Reddy Beat Vemireddy, Vemireddy Prabhakar Reddy, Vijayasai Reddy, TDP, YCP, Latest AP News, Latest Politicsl News, AP Elections, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Vemireddy prabhakar reddy, vijayasai reddy, tdp, ycp

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది. విజయ దుందుభీ మోగించింది. కానీ ఈసారి నెల్లూరులో ఆసక్తికరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ నెల్లూరులో ముగ్గురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిలు వైసీపీకి రాజీనామా చేసి సైకిలెక్కేశారు.

నెల్లూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. నేడో.. రేపో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాల మధ్య నెల్లూరులో వైసీపీ కొంత బలహీనపడిందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయసాయి రెడ్డిని వైసీపీ బరిలోకి దించడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం తొమ్మిదో జాబితా విడుదల చేసిన వైసీపీ.. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా విజయసాయిరెడ్డిని నియమించింది.

వాస్తవానికి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని వైసీపీ ముందుగా నిర్ణయించింది. అదే సమయంలో వేమిరెడ్డి నెల్లూరులోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు తన అనుచరులకి టికెట్ ఇవ్వాలని.. తన భార్యకు కూడా టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారు. కానీ అందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరించింది. దీంతో అలకబూనిన వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరి ఆ పార్టీ తరుపున నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా బలవంతుడు. నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి బలం, బలగం ఉంది. అటు విజయసాయిరెడ్డిది కూడా స్వస్థలం నెల్లూరు జిల్లానే. అందుకే వేమిరెడ్డిని ఢీ కొట్టాలంటే విజసాయిరెడ్డే కరెక్ట్ అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి పదవీకాలం 2028 వరకు ఉన్నప్పటికీ.. ఆయన్ను లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. మరి విజయసాయిరెడ్డి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీ కొట్టగలరా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =