వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ప్రొత్సాహాకాన్ని పెంచిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan, AP News, AP YSR Arogya Asara Scheme, YS Jagan Hikes YSR Arogya Asara Scheme, YSR Arogya Asara, YSR Arogya Asara Scheme, YSR Arogya Asara Scheme 2020, YSR Arogya Asara Scheme Amount, YSR Arogya Asara Scheme AP, YSR Arogya Asara Scheme News, YSR Arogya Asara Scheme Status, YSRAHC

ఆంధ్ర​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద అందించే ప్రొత్సాహాకాన్నిపెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సాధారణ ప్రసవానికి ఇస్తున్న 3వేల రూపాయల ఆర్థిక సాయాన్ని రూ.5 వేలకు, అలాగే సిజేరియన్ ప్రసవానికి సంబంధించి ఆర్ధిక సాయాన్నివెయ్యి రూపాయల నుంచి రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలను జేసీకి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ కింద ఉన్న ఆసుపత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని కోవిడ్‌ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =