తెలంగాణలో పటిష్టమైన ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకో సిస్టమ్, పెట్టుబడులతో రావాలి: మంత్రి కేటీఆర్‌

Minister KTR says Telangana has Robust Aerospace Defence Ecosystem and Favours for Investments,Telangana Aerospace, Telangana Defense, Telangana Eco-System,Telangana Investments, Minister Ktr,Investments In Defense,Investments In Aerospace,Investments In Eco-System,Mango News,Mango News Telugu,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister Ktr

సొసైటీ ఫర్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో డిఫెన్స్ తయారీ రంగంలో ఉన్న అవకాశాలను తెలియజేసి, రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పటిష్టమైన ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఎకో సిస్టమ్ గురించి, రాష్ట్రంలో ఉత్పత్తి మరియు ఎగుమతి సౌకర్యాలను కలిగి ఉన్న గ్లోబల్ ప్లేయర్‌ల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. ఫైనాన్షియల్ టైమ్ ఎఫ్‌డిఐ ఫ్యూచర్ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్ 2020-21 ప్రకారం హైదరాబాద్‌లోని ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్‌లో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సదస్సుకు తెలియజేశారు.

హైదరాబాద్‌ను భారతదేశ మిస్సైల్ హబ్ గా పిలుస్తారని మరియు 1960ల ప్రారంభం నుండి రక్షణ పరిశ్రమకు ప్రముఖ తయారీ మరియు పరిశోధనా కేంద్రంగా ఉందన్నారు. ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో పాటు, డీఆర్డీవో ల్యాబ్‌లు, బీడీఎల్, హెఛ్ఏఎల్, ఈసీఐఎల్ వంటి వాటికి హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇస్తుంది. 1000 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు ఈ రంగానికి సేవలు అందిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సంస్థలు సైతం తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ మరియు అనేక ఇతర దేశాలకు చెందిన ప్రముఖ ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్) కంపెనీలు ఒకేచోట ఇంత భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం ప్రపంచంలో ఇంకొకటి లేదంటే ఆశ్చర్యం లేదని తెలిపారు. ప్రఖ్యాత డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ సంస్థలైన లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జిఈ, సాఫ్రాన్ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం స్పేస్ మరియు డిఫెన్స్ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించిందని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు సాధించేందుకు అవసరమైన పరిపాలనపరమైన సంస్కరణలను చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఇంటరాక్టీవ్ సదస్సులో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఓ.ఎస్.డి గా ఉన్న సీనియర్ అధికారి సంజయ్ జాజు, తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఏరో స్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here