సీఎం జగన్‌తో భేటీ అయిన ‘టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌’ ప్రతినిధులు.. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి

Tata Advanced Systems Representatives Meets CM YS Jagan Mohan Reddy To Discuss Invests in AP, Tata Advanced Systems Met AP CM, AP CM Jagan Discuss Investements With Tata Advanced Systems, CM YS Jagan Mohan Reddy To Discuss Invests in AP, AP CM YS Jagan Mohan Reddy, Mango News , Mango News Telugu, Tata Advanced Systems , AP CM YS Jagan Latest News And Updates, Tata Advanced Systems News, AP CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు మరో ప్రముఖ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించారు. దీనిపై ప్రభుత్వం తరఫునుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని టాటా ప్రతినిధులకు సీఎం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుశిక్షితులైన మానవ వనరులు, అపార మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్న సీఎం జగన్.. ఏపీలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వారికి వివరించారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్‌ జే. శ్రీధర్, టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ హెడ్‌ మసూద్‌ హుస్సేనీ తదితరులు ఉన్నారు. ఇక ప్రభుత్వం తరపున ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, పలువురు సీఎంవో అధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eight =