సెప్టెంబర్ 1,2 తేదీల్లో కేరళ, కర్ణాటకలలో ప్రధాని మోదీ పర్యటన, ఐఎన్ఎస్ విక్రాంత్‌ ప్రారంభం

PM Modi will Commission the First Indegenous Aircraft Carrier INS Vikrant on September 2nd, PM Modi To Launch Aircraft INS Vikrant, PM Modi To Launch Indegenous Aircraft Carrier, Mango News, Mango News Telugu,Aircraft Carrier INS Vikrant Launch, INS Vikrant Latest News And Updates, INS Vikrant, PM Modi Kerala Tour, PM Modi Karnataka Tour, PM Narendra Modi News And Live Updates

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 1,2 తేదీలలో కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సెప్టెంబరు 1, గురువారం సాయంత్రం 6 గంటలకు కొచ్చిన్ విమానాశ్రయానికి సమీపంలోని కాలడి గ్రామంలోని ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలమైన శ్రీ ఆదిశంకర జన్మ భూమి క్షేత్రాన్ని ప్రధాని సందర్శిస్తారు. ఇక సెప్టెంబర్ 2, శుక్రవారం ఉదయం 9:30 గంటలకు కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ ను
ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు వేసేలా ఐఎన్ఎస్ విక్రాంత్‌ దేశీయంగా రూపొందించబడింది. ఇది ఇండియన్ నేవీ ఇన్-హౌస్ వార్‌షిప్ బ్యూరోచే డిజైన్ చేయబడగా, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌చే నిర్మించబడింది. విక్రాంత్ అత్యాధునిక ఆటోమేషన్ లక్షణాలతో నిర్మించబడగా, భారతదేశ మారిటైమ్ చరిత్రలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద ఓడగా నిలిచింది.

అనంతరం ప్రధాని మోదీ కర్ణాటకలోని మంగుళూరుకు చేరుకొని, శుక్రవారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు మంగ‌ళూరులో దాదాపు 3800 కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు ప్రారంభోత్సవాలు, శంకుస్థాప‌నలు చేయనున్నారు. న్యూ మంగుళూరు పోర్ట్ అథారిటీ చేపట్టిన కంటైనర్లు మరియు ఇతర కార్గో నిర్వహణ కోసం బెర్త్ నంబర్ 14 యాంత్రీకరణకై రూ.280 కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే పోర్ట్ ద్వారా చేపట్టిన సుమారు రూ.1000 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ చేపట్టిన బిఎస్ 6 అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్ మరియు సీ వాటర్ డీశాలినేషన్ ప్లాంట్ అనే రెండు ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =