సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపించిన పలు పార్టీలు

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Council Chairman, AP Select Committee, BJP Political News, Mango News Telugu, progressive democratic party, TDP latest news

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీ కోసం సభ్యుల పేర్లు ఇవ్వాల్సిందిగా మండలి ఛైర్మన్ షరీఫ్‌ కోరారు. ఈ నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ కోసం టీడీపీ, బీజేపీ, ప్రొగ్రసీవ్ డెమొక్రటీవ్ ఫ్రంట్ పార్టీలు ఫిబ్రవరి 3, సోమవారం నాడు తమ సభ్యులను ప్రకటించాయి. ఒక్కో కమిటీలో టీడీపీ నుంచి ఐదుగురికి, బీజేపీ, పీడీఎఫ్ పార్టీలనుంచి ఒక్కొక్కరికి మండలి ఛైర్మన్ అవకాశం కల్పించారు. అధికార వైసీపీ పార్టీ నుంచి ఇంతవరకు ఎలాంటి సభ్యుల జాబితా అందలేదని సమాచారం. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ ప్రక్రియలో భాగస్వాములు కాబోమని అధికారపార్టీకి చెందిన నేతలు ప్రకటించినట్టుగా తెలుస్తుంది.

సెలెక్ట్ కమిటీల కోసం టీడీపీ పంపిన సభ్యులు వివరాలు:

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు(మూడు రాజధానుల బిల్లు) కమిటీ:

  • నారా లోకేష్‌
  • అశోక్‌బాబు
  • తిప్పేస్వామి
  • బీటీ నాయుడు
  • గుమ్మడి సంధ్యారాణి

సీఆర్‌డీఏ రద్దు బిల్లు కమిటీ:

  • దీపక్‌రెడ్డి
  • బీదా రవిచంద్ర
  • బచ్చుల అర్జునుడు
  • గౌరవాని శ్రీనివాసులు
  • బుద్దా నాగజగదీశ్వరరావు

సెలెక్ట్ కమిటీల కోసం బీజేపీ పంపిన సభ్యులు వివరాలు:

  • మూడు రాజధానుల బిల్లు కమిటీ: మాధవ్‌
  • సీఆర్‌డీఏ రద్దు బిల్లు కమిటీ: సోము వీర్రాజు

సెలెక్ట్ కమిటీల కోసం పీడీఎఫ్ పంపిన సభ్యులు వివరాలు:

  • మూడు రాజధానుల బిల్లు కమిటీ: కేఎల్‌ లక్ష్మణరావు
  • సీఆర్‌డీఏ రద్దు బిల్లు కమిటీ: ఇళ్ల వెంకటేశ్వరరావు

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 12 =