న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక

2020 Latest Sport News, India vs New Zealand, India vs New Zealand Match, India vs New Zealand Match Live Updates, India vs New Zealand Test Series, latest sports news, Mango News Telugu, Prithvi Shaw, Shubman Gill Returns to Test Squad, sports news

న్యూజిలాండ్‌ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేసి భారత్‌ జట్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పర్యటనలో న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, రెండు టెస్టులు భారత్ ఆడనుంది. న్యూజిలాండ్ తో తలపడే భారత్ వన్డే జట్టును బీసీసీఐ ఇదివరకే ప్రకటించగా, తాజాగా టెస్టు జట్టును ప్రకటించింది. ఈ టెస్టు జట్టులో యువ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా, శుభ్ మన్ గిల్, యువ పేసర్ నవదీప్ సైనీ చోటు దక్కించుకున్నారు. అయితే గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న కేఎల్ రాహుల్ ను టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు. ఇటీవల రంజీ ట్రోఫీలో గాయపడిన పేసర్ ఇషాంత్ శర్మను కూడా టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు. మరోవైపు న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో వన్డే సిరీస్ కు మయాంక్ అగర్వాల్ కు చోటు కల్పించారు. ఫిబ్రవరి 21 నుంచి వెల్లింగ్టన్ వేదికగా మొదటిటెస్టు, ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా రెండో టెస్టు జరగనుంది. అలాగే ఫిబ్రవరి 5,8,11 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.

భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్,మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, ఇశాంత్ శర్మ (ఫిట్నెస్ క్లియరెన్స్‌కు లోబడి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here