మే 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు, 16 కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు

TDP Chief Chandrababu Formed 16 Committees to Conduct Mahanadu in Ongole on May 27 and 28, Chandrababu Formed 16 Committees to Conduct Mahanadu in Ongole on May 27 and 28, 16 Committees to Conduct Mahanadu in Ongole on May 27 and 28, Mahanadu in Ongole on May 27 and 28, Mahanadu in Ongole, TDP Mahanadu in Ongole from May 28, politburo meeting of the TDP, Telugu Desam party, TDP party's annual conclave, Mahanadu will be organised in Ongole from May 27 and 28, 16 Committees to Conduct Mahanadu, 16 Committees, Mahanadu, TDP party's two-day annual conclave, Mahanadu Program News, Mahanadu Program Latestr News, Mahanadu Program Latest Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి (మే 28) సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశనం చేసుకోవడాన్ని టీడీపీ ఆనవాయితీగా పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఒంగోలులో నిర్వహించే మహానాడు కోసం మొత్తం 16 కమిటీలను ఏర్పాటు చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో మహానాడు నిర్వహణ, సమన్వయ కోసం మొత్తం 145 మందితో 16 కమిటీలను చంద్రబాబు ప్రకటించారు.

ఆహ్వాన, మహానాడు నిర్వహణ సమన్వయం, తీర్మానాలు, వసతి ఏర్పాట్లు, సభా నిర్వహణ, భోజనాల ఏర్పాట్లు, పత్రికా మీడియా/సోషల్ మీడియా సంబంధాల కమిటీ, ఆర్ధిక వనరులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోటో ప్రదర్శన, ప్రతినిధులు, ప్రాంగణ పర్యవేక్షణ, నగర అలంకరణ, రవాణా మరియు వాహన పార్కింగ్, రక్తదాన మరియు మెడికల్ క్యాంప్, వాలంటీర్ల నిర్వహణ పేరుతో 16 కమిటీలను ఏర్పాటు చేశారు.

ఆహ్వాన కమిటీలో అచ్చెన్నాయుడు, బక్కని నరసింహులు ఉండగా, మహానాడు నిర్వహణ సమన్వయం కమిటీలో నారా లోకేష్, మద్దిపాటు వెంకటరాజు, చింతకాయల విజయ్, కిలారు రాజేష్, తీర్మానాల కమిటీలో యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాలవ శ్రీనివాసులు, షరీఫ్‌, నక్కా ఆనంద్‌బాబు, నిమ్మల రామానాయుడు, గురజాల మాల్యాద్రి, రావుల చంద్రశేఖర్​రెడ్డి, చిలువేరు కాశీనాథ్, వసతి ఏర్పాట్ల కమిటీలో బీద రవిచంద్ర, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, ప్రత్తిపాటి పుల్లారావు, నూకసాని బాలాజీ, యరపతినేని శ్రీనివాసరావు, దామచర్ల జనార్దన్, ముత్తమల అశోక్ రెడ్డి, టీడీ జనార్దన్, కోవెలమూడి రవీంద్ర,ఇంటూరి నాగేశ్వరరావు, జీవి రెడ్డి, పిడతల సాయి కల్పనా రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, బంటు వెంకటేశ్వర్లు, జీవన్, సభా నిర్వహణ కమిటీలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆదిరెడ్డి భవాని, పయ్యావుల కేశవ్‌, రామ్మోహన్‌నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కూన రవి కుమార్, నన్నూరి నర్సిరెడ్డి, ఆర్దిక వనరుల కమిటీలో గల్లా జయదేవ్, కేశినేని నాని, పొంగూరు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, జీవీ ఆంజనేయులు, బీసీ జనార్దనరెడ్డి, దామచర్ల ఆంజనేయులు, పుట్టా సుధకర్ యాదవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, దామచర్ల సత్య, గడ్డి పద్మావతి, ఓరుగంటి ప్రభాకర్ ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here