‘చలో ఆత్మకూరు’ రద్దు చేసే ప్రసక్తే లేదు

Chandrababu Naidu Chalo Atmakur Rally, Chandrababu Naidu Declares 11th September As Black Day, Chandrababu Naidu Declares 11th September As Black Day In AP, Chandrababu Naidu Latest Political News, Chandrababu Naidu Responds House Arrest, Chandrababu Naidu Responds Over His House Arrest, Mango News Telugu, TDP Chief Chandrababu Naidu Responds House Arrest, TDP Chief Chandrababu Naidu Responds Over His House Arrest

చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళుతున్న తనను గృహ నిర్బంధం చేయడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను నిర్బంధిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చీకటి రోజు అని చెప్పారు. ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నిర్వహిస్తున్న శిబిరం వద్దకు భోజనాలు కూడ అనుమతించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నిర్బంధ చర్యలన్నీ పాలించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని, చరిత్రలో ఇంతకూ ముందెప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు. తనను ఈ విధంగా ఎన్ని రోజులు నిర్బంధంలో ఉంచుతారో చూస్తానన్నారు.

అరెస్టులు, నిర్బంధాలతో చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, సమస్య పరిష్కరమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. 540 బాధిత కుటుంబాలను వారి వారి గ్రామాలకు తరలించేవరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేసారు. ఎట్టి పరిస్థితులలో కూడ చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు బయటకు వెళ్లకుండా గేటుకు తాళాలు వేయడంతో చంద్రబాబు అక్కడే తన కారులో కూర్చున్నారు. బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేవరకు అక్కడే కూర్చుంటానని ఆయన పోలీసులకు తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

 

[subscribe]
[youtube_video videoid=H0F8n1v2q5A]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =