ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ

Aler MLA Gongidi Sunitha, Aler MLA Gongidi Sunitha Tested Positive, Coronavirus, Coronavirus Latest News, COVID-19, Gongidi Sunitha Mahender Reddy, Gongidi Sunitha Tested Positive, Gongidi Sunitha Tested Positive for Covid-19, telangana, Telangana Coronavirus, TRS MLA Gongidi Sunitha tests positive

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్‌ గొంగిడి సునీత కు కూడా ఈ రోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత నాలుగు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆమె హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆమెకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలినట్టు పేర్కొన్నారు. ఆమె ప్రస్తుతం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో ఆమె భర్త, నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఫలితం ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణలో కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలాగే వారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో, వారితో సన్నిహితంగా ఉన్న వారిని అధికారులు గుర్తించి పలు కీలక సూచనలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here