ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్​ పరీక్షల కొత్త షెడ్యూల్ వివరాలు ఇవే…

AP Intermediate Public Exams-2022 Revised Time Table Released, Andhra Pradesh New Schedule Released for Intermediate Public Exams-2022, AP New Schedule Released for Intermediate Public Exams -2022, AP Education Department Revised Time Table Released For Intermediate 2022, Education Department Revises Intermediate 2022 Schedule, AP Education Department Revises Intermediate 2022 Schedule, AP Education Department, AP Intermediate Public Exams-2022 Schedule Revised, Intermediate Public Exams-2022 Schedule Revised, AP Intermediate Public Exams-2022, Intermediate Public Exams-2022, Schedule Revised, Andhra Pradesh Education Department, new dates for the Andhra Pradesh Intermediate examinations, Andhra Pradesh Intermediate examinations, Intermediate Public Exams, Intermediate Public Exams Latest News, Intermediate Public Exams Latest Updates, Intermediate Public Exams Live Updates, 2022 Intermediate Public Exams, Intermediate Public Exams-2022 Schedule, 2022 Intermediate Public Exams Schedule Revised, 2022 Intermediate Public Exams Schedule, Mango News, Mango News Telugu,

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్ లో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాజాగా సవరించిన టైమ్ టేబుల్/షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి మే 23 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, మే 7 నుంచి మే 24 వరకు ఇంటర్‌ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జరగనున్నాయి.

ముందుగా జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ దృష్ట్యా ఏపీ ఇంటర్ బోర్డు ఇటీవలే ఏప్రిల్ 22 నుంచి మే 12వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేలా సవరించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే జేఈఈ మెయిన్స్-2022 మొదటి విడత పరీక్షల తేదీలను మారుస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మొదటి విడత పరీక్షలను ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను మరోసారి మారుస్తూ ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరోసారి సవరించిన షెడ్యూల్ ను శుక్రవారం నాడు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మే 6: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
  • మే 9: ఇంగ్లీష్ పేపర్-1
  • మే 11: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1
  • మే 13: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
  • మే 16: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
  • మే 18: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైనర్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1
  • మే 20: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
  • మే 23: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • మే 7: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
  • మే 10: ఇంగ్లీష్ పేపర్ -2
  • మే 12: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1
  • మే 14: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
  • మే 17: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • మే 19: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2
  • మే 21: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2 (బైపిసి విద్యార్థులకు)
  • మే 24: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =