రగ్డ్‌గా కనిపించడానికి మొగ్గుచూపుతున్న స్టార్ హీరోలు

Tollywood Star Heroes Shows Interest on Mass Characters and Rugged Looks in Recent Times,Tollywood Star Heroes Shows Interest,Interest on Mass Characters,Characters and Rugged Looks in Recent Times,Mango News,Mango News Telugu,Megastar Chiranjeevi, Waltheru Veeraiya, Dussehra movie, Guntur Karam, Mahesh Babu, Mahesh lungi poster, Nagarjuna,Tollywood Star Heroes Latest News,Tollywood Star Heroes Latest Updates,Tollywood Star Heroes Live News,Tollywood Mass Characters Latest News,Tollywood Rugged Looks News

అక్కినేని అందగాడు నాగార్జున నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. నా సామిరంగ. కోరియోగ్రాఫర్ విజయ్ బెన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కింద శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఆఫీసర్, మన్మథుడు 2, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్.. వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. బంగార్రాజు ఒక్కటే హిట్ అయింది. దాని తరువాత వచ్చిన ఘోస్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియని పరిస్థితి. ఓ మాస్ ఎంటర్‌టైనర్ కోసం నాగార్జున అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తూ వస్తున్నారు.

అలాంటి మూవీనే నా సామిరంగ. నాగ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటింగ్ గ్లింప్సెస్‌ను రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. విలన్ అండ్ గ్యాంగ్స్‌తో తలపడే సన్నివేశాన్ని గ్లింప్సెస్‌గా కట్ చేశారు. ఇందులో మాస్ లుక్స్‌తో మెరిశాడు నాగార్జున. అడ్డపంచె, బీడీతో రగ్డ్‌గా కనిపించాడు. ఓ మంచి మాస్ మూవీ పడినట్టే.

ఇంట్రడక్షన్ సీన్‌లో నాగార్జున బీడీని వెలిగించుకోవడం డిబేట్స్‌కు తెర తీసింది. ఈ మధ్యకాలంలో టాప్ హీరోలందరూ మాస్ మంత్రాన్ని జపిస్తోన్నారనడానికి ఇదో పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి ఇదే లుక్‌తో సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత దసరా సినిమాతో నాని గెటప్ కూడా ఇదే. ఇక గుంటూరు కారంలో మహేష్ బాబు సైతం ఊర మాస్ లుక్స్‌తో అదరగొట్టాడు. గుంటూరు కారం టైటిల్ గ్లింప్సెస్‌లోనూ బీడీతో కనిపించాడు. మహేష్ బర్త్‌డే కానుకగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్‌లో లుంగీతో మెరిశాడు. ఇప్పుడు నాగార్జున కూడా అదే సక్సెస్ మంత్రాన్ని జపిస్తోన్నాడు. బీడీ-లుంగీతో మాస్ మెసేజ్ ఇచ్చాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here