ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో బీఎస్పీ చేరుతుందా? లేదా?

BSP Chief Mayawati Announces No Alliance With INDIA or NDA For 2024 Elections,BSP Chief Mayawati,Mayawati Announces No Alliance With INDIA,No Alliance With INDIA or NDA,INDIA or NDA For 2024 Elections,Mango News,Mango News Telugu,BSP join'India', BSP, India,Mayavathi, Mumbai India Sabha, BSP Leader, India Leaders, Elections,BSP Chief Mayawati Latest News,BSP Chief Mayawati Latest Updates,BSP Chief Mayawati Live News,2024 Elections Latest News,2024 Elections Latest Updates,Lok Sabha Polls 2024,Lok Sabha Polls 2024 Latest News

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనల్ పాలిటిక్స్ శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీయే వ్యతిరేక పార్టీలను.. ఒక తాటిపైకి తీసుకురావడానికి ‘ఇండియా’ కూటమి నేతలు.. తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సర్కారును ఎలా అయినా గద్దె దించేందుకు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

అంతేకాదు రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కార్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు చర్చించాల్సిన అంశాలపై ఇండియా కూటమి పార్టీల నేతలు ముంబైలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో సమావేశమవున్నారు. ఇదే సమయంలో.. బహుజన్ సమాజ్‌వాది పార్టీ కూడా విపక్ష కూటమి అయిన ఇండియాలో చేరే అవకాశముందని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై.. ఆ పార్టీ చీఫ్ మాయావతి రియాక్టయ్యారు. ఎన్డీయేలో కానీ ఇండియా కూటమిలో కానీ బీఎస్పీ ఎట్టి పరిస్థితిలోనూ చేరబోదని ఆమె తేల్చేసి చెప్పేసారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ వేదికగా మాయావతి స్పష్టంచేశారు. ఇండియా కూటమిలో బహుజన్ సమాజ్‌వాది పార్టీ త్వరలోనే చేరుతున్నట్లు అవాస్తవ కథనాలు ఇకపై ప్రచారం చేయొద్దని మాయావతి మీడియాను కూడా కోరారు.

తమ పార్టీ ఎన్డీయే,ఇండియా కూటమితో ఎందుకు చేరడం లేదో కూడా మాయావతి వివరించారు. ఎన్డీఏ, ఇండియా రెండు కూటములలోని చాలా పార్టీలు ప్రజా వ్యతిరేక, కులతత్వ,పెట్టుబడిదారీ పార్టీలేనని ఆమె ఆరోపించారు. ఇలాంటివాటికి వ్యతిరేకంగా తమ పార్టీ చాలా కాలంగా పోరాటం చేస్తోందని మాయావతి గుర్తు చేశారు. అలాంటి పార్టీలతో చేతులు తాము ఇప్పుడు కలిపి ఎన్నికల బరిలో నిలిచే ప్రసక్తే లేదంటూ మాయావతి తేల్చి చెప్పేశారు. అంతేకాదు ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ.. ఆ కూటమి ఇప్పుడు తమతో చేతులు కలిపిన వారే లౌకిక పార్టీలు అన్నట్లు ప్రచారం చేసుకోవడం నిజంగా విడ్డూరంగా ఉందని సెటైర్ వేశారు.

మరోవైపు ఈ రోజు, రేపు ముంబైలో జరిగే ఇండియా కూటమి నేతల సమావేశం గురించి అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో.. తమ పార్టీల సీట్ల పంపిణీని ఇండియా కూటమి ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 27 పార్టీలకు చెందిన సుమారు 62 మంది ప్రతినిధులు వరకూ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దీనికి తోడు ఈ సమావేశంలోనే ఇండియా కూటమి లోగోకు పార్టీ ప్రతినిధులు ఆమోదం తెలపడంతో పాటు.. విపక్ష కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికను ఈ సమావేశంలోనే ఖరారు చేసే అవకాశముంది.

అంతేకాదు ఇండియా కూటమికి ఎవరు కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నవిషయంలోనూ ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది . ఈ కూటమి తొలి సమావేశం పాట్నాలోనూ.. రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. తాజాగా ఇప్పుడు మూడోసారి ముంబైలో జరుగుతోంది. ఈ మూడో సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి.. దీనిని విజయవంతం చేసేందుకు మహా వికాస్ అగాడీ ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =