రాష్ట్రంలోని అన్ని బస్ టెర్మినల్స్‌కు పులివెందుల వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌ ఆదర్శం కావాలి – సీఎం జగన్

AP CM YS Jagan Mohan Reddy, AP CM Inaugurates YSR Bus Terminal in Pulivendula Today, Mango News, Mango News Telugu, CM Jagan Public Meeting at Pulivendula, Visuals of Dr YSR bus terminal Pulivendula, AP CM YS Jagan to Visit Pulivendula Today, CM Jagan Inaugurating Dr. YSR Bus Stand, YSR bus Terminal Pulivendula, Pulivendula YSR Bus Terminal, AP CM Latest News, YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బస్ టెర్మినల్స్‌కు పులివెందులలోని డా. వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌ ఆదర్శం కావాలని అభిలషించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన తన మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన శనివారం పులివెందుల పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందుల దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పులివెందులను తీర్చిదిద్దతున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అత్యాధునిక వసతులతో పులివెందులలో అతిపెద్ద వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మిస్తున్నామని, అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్ళుగా లంచాలకు, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, తమకు ఓట్లు వేయనివారికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ ‘నాడు – నేడు’ ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభించారు. ఆ తర్వాత మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని, అలాగే గార్బేజీ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఇక దీనికి ముందు సీఎం జగన్ పులివెందుల రోడ్ విస్తరణ, కూరగాయల మార్కెట్ లను ప్రారంభించారు. కాగా ఆదివారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + eleven =