టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం, ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు

TRS MLAs Poaching Case SIT Issues Notices To AP MP Raghu Rama Krishna Raju,Key Development in TRS MLAs Purchase Case, SIT notices to MP Raghuramakrishna Raju,Mla Purchase Case, Give Notice To Bl Santosh By E-Mail, Telangana Hc Orders Sit,Telangana Mla Poaching Case,Telangana Mla Poaching Case Latest News And Updates,Telangana Mla Poaching ,Telangana Bjp,Telangana Cm Kcr,Trs Party,Brs Party,Ysrtp,Brs Party Latest News And Updates,Trs Mlas Purchase Case,Sit Notices Issued To Two Others, Ordered To Appear For Hearing Today,Telangana Sit,Sit Investigation Mla Poaching Case,Trs Mla Poaching Case,Mango News,Mango News Telugu

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ప్రయత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) లోతుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 6గురికి నోటీసులు ఇచ్చిన సిట్ తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం ఎంపీకి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఆయన ప్రమేయంపై సిట్ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ నెల 29వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు దీనిపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణరాజు, ఇప్పటివరకూ తనకు సిట్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. తనకు సిట్ నోటీసులిచ్చినట్లుగా మీడియాలో చూశానని, అయితే తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని ఆయన తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =