నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌, గ్రూప్‌-2, గ్రూప్-3, గ్రూప్-4 లో మరికొన్ని పోస్టులను చేర్చిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Included Several Types Posts Newly in Group 2 - 3 and 4 List for Recruitment,Telangana Government Posts In Group-2,Telangana Govt Group-3 Posts,Telangana Group-4 Posts,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Govt Jobs 2022,Telangana Govt Jobs,Telangana Govt Jobs News And Live Updates,Telangana Govt Jobs Notification,Telangana Govt Jobs Notifications 2022,Telangana Govt Notifications 2022

రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలయి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలోనే గ్రూప్‌-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదలకు కూడా కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-2, గ్రూప్-3, గ్రూప్-4 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో మరికొన్ని రకాల పోస్టులను చేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో ఇచ్చిన 55 జీవోను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్-2లో కొత్తగా 6 రకాల పోస్టులు, గ్రూప్-3లో కొత్తగా 2 రకాల పోస్టులు, గ్రూప్-4లో 4 రకాల పోస్టులు చేర్చబడ్డాయి.

గ్రూప్-2 లో కొత్తగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (రాష్ట్ర ఎన్నికల సంఘం), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలు), జూవైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వంటి పోస్టులను చేర్చారు. గ్రూప్-3 లో కొత్తగా గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్, హెచ్‌ఓడీల్లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ వంటి పోస్టులు చేర్చారు. అలాగే గ్రూప్-4 లో జూవైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) జువైనల్ సర్వీసెస్ లో మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్, కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మ్యాట్రన్, జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ వంటి పోస్టులను చేర్చారు. ఈ పోస్టుల చేరికతో గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =