సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. తెలంగాణ‌ అమ్మాయి ఉమా హారతికి 3, తిరుపతికి చెందిన పవన్‌ దత్తాకు 22 ర్యాంకులు

UPSC Civil Services 2022 Final Results Released Several AP and Telangana Students Gets Top Ranks,UPSC Civil Services 2022,UPSC Civil Services 2022 Final Results Released,AP and Telangana Students Gets Top Ranks,UPSC AP and Telangana Students Gets Top Ranks,Mango News,Mango News Telugu,UPSC IAS Final Result 2022 announced,UPSC Civil Services,UPSC Final Results Released,Andhra candidates shine in civil services,UPSC Latest News,UPSC Latest Updates,UPSC,UPSC News,UPSC Results Released News Today,UPSC Results Released Latest News,UPSC Results Released Latest Updates,UPSC 2023

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వ‌హించిన సివిల్స్-2022 తుది ప‌రీక్ష‌ల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 933 మంది ఎంపిక కాగా.. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. అలాగే సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌-బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. కాగా ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో సరిచూసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది.

ఇక సివిల్స్‌ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులనూ అమ్మాయిలే సాధించడం విశేషం. ఇషితా కిశోర్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. గరిమ లోహియా, ఉమా హారతి, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు. కాగా ఉమా హారతి తెలంగాణ అమ్మాయి కావడం గమనార్హం. ఆమె సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌న‌గ‌ర్ నివాసి అయిన నూక‌ల వెంక‌టేశ్వ‌ర్లు కుమార్తె. కాగా ఇంకా సివిల్స్‌కు ఎంపికైన వారిలో ఏపీ, తెలంగాణ‌కు చెందిన ప‌లువురు అభ్య‌ర్థులు ఉన్నారు. తిరుప‌తికి చెందిన బీవీఎస్ ప‌వ‌న్ ద‌త్తా 22వ ర్యాంకు సాధించారు.

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు

  • శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌ – 40వ ర్యాంక్
  • హెచ్‌ఎస్‌ భావన – 55
  • సాయి ప్ర‌ణ‌వ్‌ – 60
  • ఆవుల సాయికృష్ణ – 94
  • నిధి పాయ్ – 110
  • ఏనుగు శివమారుతీ రెడ్డి – 132
  • రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157
  • కమతం మహేశ్‌కుమార్‌ – 200
  • రావుల జయసింహారెడ్డి – 217
  • సాహిత్య – 243
  • అంకుర్‌ కుమార్‌ – 257
  • బొల్లం ఉమామహేశ్వర్‌ రెడ్డి – 270
  • చల్లా కల్యాణి – 285
  • పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి – 292
  • గ్రంథె సాయికృష్ణ – 293
  • వీరగంధం లక్ష్మి సుజిత – 311
  • హర్షిత – 315
  • ఎన్‌.చేతనా రెడ్డి – 346
  • శృతి యారగట్టి – 362
  • యప్పలపల్లి సుష్మిత – 384
  • రేవయ్య – 410
  • సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి – 426
  • బొల్లిపల్లి వినూత్న – 462
  • కమల్ చౌదరి – 656
  • రెడ్డి భార్గవ్ – 772
  • నాగుల కృపాకర్ – 866

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − five =