ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి నేటితో ఏడాది పూర్తయింది. మే 30, 2019న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఇచ్చిన హామీలను ముందువరసలో పెట్టి, సంవత్సర కాలంలోనే 90 శాతం హామీల అమలు దిశగా అడుగులువేసి ప్రజలకు మరింతగా చేరువయ్యారు.
సీఎంగా ఏడాది కాలంలో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల వివరాలు:
- పేద విద్యార్థుల కోసం జగనన్న అమ్మ ఒడి – రూ.15000 ఆర్ధిక సాయం – 82 లక్షల మంది పిల్లలకు లబ్ది
- ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు నాడు- నేడు – 15715 పాఠశాల్లో పనులు
- నాణ్యమైన మధ్యాహ్న భోజనం జగనన్న గోరు ముద్ద – 36,34,861 మంది విద్యార్థులకు
- ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఏర్పాట్లు
- రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా – ఏటా రూ.13500 – 49 లక్షల మందికి లబ్ది
- 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు
- పేద ప్రజలకు వైద్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ
- ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు కోసం 11162 గ్రామ/ వార్డు సచివాలయాలు – 1 లక్ష 34 వేల శాశ్వత ఉద్యోగాల కల్పన
- 1,93,421 గ్రామా వాలంటీర్లు, 74659 వార్డు వాలంటీర్లు
- మొత్తం 4 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన
- పింఛన్లు – 59 లక్షల మందికి లబ్ది
- పేద విద్యార్థులకు భోజనం, వసతి కల్పించేలా జగనన్న వసతి దీవెన – పూర్తీ ఫీజు రియంబర్స్ మెంట్
- జగనన్న వసతి దీవెన – కోర్సుల వారీగా వసతికోసం ఆర్థిక సాయం – దాదాపు 16 లక్షల మందికి లబ్ది
- దశలవారీగా మద్యం నియంత్రణ
- వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం -91 లక్షల మంది పొదుపు సంఘం మహిళలకు లబ్ది
- మహిళలపై జరిగే అన్యాయాలు అణిచివేసేందుకు దిశా బిల్లు, దిశా పోలీస్ స్టేషన్స్
- పేదలందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ – 29 లక్షల మందికి పైగా లబ్ది
- వైఎస్ఆర్ వాహన మిత్రా- ఏటా రూ 10,000 ఆర్థిక సాయం – 2,39,957 లబ్ధిదారులు
- వైఎస్ఆర్ నేతన్న నేస్తం – ఏటా రూ 24,000 ఆర్థిక సాయం – 81703 కుటుంబాలకు లబ్ది
- వైఎస్ఆర్ మత్స్యకార భరోసా – ఏటా రూ 10,000 ఆర్థిక సాయం – 1,09,231 లబ్ధిదారులు
- వైఎస్ఆర్ లా నేస్తం – నెలకు రూ.5000 – 2012 లబ్ధిదారులు
- అర్చకులు, పాస్టర్లు, మౌజమ్ లకు సాయం – రూ.5000 ఆర్థిక సాయం – 77,290 లబ్ధిదారులు
- అగ్రిగోల్డ్ బాధితులకు సాయం
- ఎం.ఎస్.ఎం.ఈ లకు రీస్టార్ట్ ప్యాకేజి
- ఏపీఎస్ఆర్టీసీ విలీనం.
- పోలీసులకు వీక్లీ ఆఫ్
- పలు ప్రాజెక్ట్‌ల్లో రివర్స్ టెండరింగ్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu