మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Review Meeting On Women And Children Welfare Department, YS Jagan Conducts Review Meeting, YS Jagan Conducts Review Meeting On Women And Children, YS Jagan Conducts Review Meeting On Women And Children Welfare, YS Jagan Conducts Review Meeting On Women And Children Welfare Department

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మహిళా శిశుసంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పధకాల అమలుపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేసారు. సంక్షేమ పధకాల అమలులో అనుసరిస్తున్న బయోమెట్రిక్, వీడియో స్క్రీనింగ్, ఐరిస్ వంటి విధానాలు పధకాలు లబ్దిదారులకు చేరేందుకు ఉపయోగపడాలి కాని, నిరాకరించేందుకు వాడకూడదని సీఎం ఆదేశాలు జారీ చేసారు. త్వరలో మొదలయ్యే గ్రామ సచివాలయాల్లో ప్రజల అవసరాలకోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

మహిళల భద్రత కు సంబంధించి గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. జరిగిన వివిధ ఘటనల్లో బాధితులకు సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ కు కోటి రూపాయల చొప్పున నగదును నిధిగా కేటాయించాలని సీఎం వై.ఎస్ జగన్ నిర్ణయించారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళా, శిశుసంక్షేమంలో గ్రామ వాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. మరోవైపు అంగన్ వాడీ సెంటర్ల భవనాలపై స్థితిపై ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్కూళ్ల తరహాలోనే నాడు-నేడు కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసి వచ్చే మూడేళ్ళలో ఈ పనులను పూర్తి చేయాలని చెప్పారు.

 

[subscribe]
[youtube_video videoid=2tkzdzVKsVk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =