అద్భుత విజయం సాధించిన అఫ్గానిస్తాన్‌

Captain Rashid Khan Leads Afghanistan To Historic Test Win Over Bangladesh,Captain Rashid Khan Leads Afghanistan To Historic Test Win ,Rashid Khan Leads Afghanistan To Historic Test Win Over Bangladesh,Afghanistan Historic Test Win Over Bangladesh,2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Latest Sports News, latest sports news 2019, Mango News Telugu, sports news

చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్‌ 224 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. వన్డేలలో ఇప్పటికే కొన్ని సంచలనాలు సృష్టించిన అఫ్గానిస్తాన్‌ జట్టు టెస్టుల్లోనూ సత్తా చాటింది. ఆట చివరిరోజు వర్షం వలన రెండు సెషన్లు పూర్తిగా కోల్పోయిన కూడ చివరి 18 ఓవర్లలోనే నాలుగు వికెట్లు పడగొట్టిన అఫ్గానిస్తాన్‌ బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ రషీద్ ఖాన్ తోలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు, రెండో ఇన్నింగ్స్ లో కేవలం 176 పరుగులకే ఆలౌట్ అయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌ జట్టు తోలి ఇన్నింగ్స్ లో 342 పరుగులు చేసింది. రహమత్ 102 పరుగులు చేయగా, అస్గర్ అఫ్గాన్ 92, కెప్టెన్ రషీద్ ఖాన్ 55 పరుగులతో రాణించారు. ఇక బౌలర్ రషీద్ ఖాన్ ధాటికి తోలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. రషీద్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 224 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆడిన అఫ్గానిస్తాన్‌ జట్టు ఇబ్రహీం జాడ్రన్ 87, అస్గర్ అఫ్గాన్ 50, వికెట్ కీపర్ జాజాయ్ 48 పరుగులు చేయడంతో 260 పరుగుల చేసి ఆలౌట్ అయింది. 398 భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు, రషీద్ ఖాన్ ఆరు వికెట్లు తీయడంతో ఎటువంటి పోటీ ఇవ్వలేక 176 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ గా తొలిటెస్టులో 10 కి పైగా వికెట్లు, 50 కి పైగా పరుగులు చేసిన తోలి క్రికెటర్ గా రషీద్ ఖాన్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటికి అఫ్గానిస్తాన్‌ మూడు టెస్టులు మాత్రమే ఆడింది, తోలి టెస్టులో భారతజట్టుపై ఓడిపోగా, తరువాత ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించింది. ఇప్పుడు తమ కంటే బలమైన, మెరుగైన బంగ్లాదేశ్ జట్టుపై భారీ ఆధిక్యంతో విజయం సాధించి ప్రపంచక్రికెట్ లో మరోసారి వారి ముద్ర వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here