రైతుల ఆత్మహత్యలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం

Mango News, YS Jagan Directions To Collectors Over Farmer Suicides, Andhra Pradesh Political News, CM YS Jagan takes sensational decision on farmers, CM Jagan Launches YSR Rythu Bharosa for Farmers, Jagan Reddy Announces Rythu Bharosa Scheme, Jagan Reddy Speaks About Rythu Bharosa, YSR Rythu Bharosa scheme Latest News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా రైతుల ఆత్మహత్యల పై కీలక నిర్ణయం తీసుకున్నారు, ఇబ్బందులు ఎదురుకొని ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.7 లక్షలు పరిహారం పంపిణి చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఈ విధంగా రైతులకు ఇచ్చే పరిహారాన్ని వేరేవాళ్లు ఎవరు తీసుకోకుండా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.

2014- 19 మధ్య కాలంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1513 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు రికార్డ్స్ లో ఉండగా, 391 రైతు కుటుంబాలకి మాత్రమే పరిహారం చెల్లించారని, మిగతా రైతుల గురించి పరిశీలించి, వారిలో అర్హతకలిగిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని ఆదేశించారు. రైతుల సమస్యల పట్ల జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని, కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి, బాధిత రైతు కుటుంబాలని పరామర్శించి వారిలో ధైర్యం నింపాలని, వారికి కష్టాల్లో ప్రభుత్వం తోడుగా ఉందని సందేశం ఇవ్వాలని చెప్పారు. సచివాలయంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జగన్ తో పాటు, మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 9 =