ఇండియాలో చిన్న షాపింగ్ మాల్స్ సంగతేంటి?

Increasing Ghost Shopping Malls In India?, Increasing Ghost Shopping Malls, Ghost Shopping Malls In India, India Ghost Shopping Malls, Ghost Shopping Mall, Ghost Malls In India, Growing Ghost Shopping Malls, Small Shopping Malls, India, Shopping, Shapping Malls, Indain Malls, Mango News, Mango News Telugu
Ghost Malls in India,Growing ghost shopping malls,small shopping malls, India?

కాలం మారుతున్న కొద్దీ..మనుషుల అలవాట్లు, అభిప్రాయాలు అన్నీ మారిపోతున్నాయి. దీనిలో  ముఖ్యంగా చెప్పాల్సింది షాపింగ్. ఒకప్పుడు షాపింగ్ అంటే అక్కడకు వెళ్లి ఆ వస్తువును పరిశీలించి కొనేవాళ్లు. కానీ ఇప్పుడు ఏం కొనాలన్నా సరే ఎక్కువగా ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. మరీ  కాదు కూడదు అనుకుంటే మెరుగైన షాపింగ్ అనుభూతి కోసం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో  కలిసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు వెళ్లి కొంటున్నారు. దీంతో చిన్న చిన్న మాల్స్‌కు అంతగా గిరాకీ ఉండకపోవడంతో.. అవి ఘోస్ట్ మాల్స్‌లా మారిపోతున్నాయన్నాయట.

సాధారణంగా  అందుబాటులో ఉండే మాల్ ప్రాపర్టీలో నలభై శాతం వరకు ఖాళీగానే ఉంటే.. వాటిని ఘోస్ట్ మాల్స్‌గా పిలుస్తారు.  2022 సంవత్సరంలో భారత్‌లోని  ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇలాంటి ఘోస్ట్ మాల్స్  57 ఉండగా.. 2023 నాటికి వీటి సంఖ్య 64 కు పెరిగిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. ఈ విషయాన్ని  థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024 పేరుతో ఒక రిపోర్ట్ ద్వారా విడుదల చేసింది.

భారతదేశంలో మొత్తం 29 సిటీల్లో 58 హైస్ట్రీట్స్, 340 షాపింగ్ సెంటర్స్‌ను పరిశీలించాక..  నైట్ ఫ్రాంక్ ఈ నివేదిక రూపొందించింది. భారత్‌లో గత ఏడాది 64 ఘోస్ట్ మాల్స్ వల్ల సుమారుగా 13.3 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ స్పేస్.. నిరుపయోగంగా మారిపోయినట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే  నిరుపయోగంగా మారిన స్పేస్ శాతం 58 వరకూ పెరిగినట్లు పేర్కొంది.

దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే ఎక్కువగా ఘోస్ట్ షాపింగ్ మాల్స్ ఉన్నట్లు  నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, బెంగళూరు ఉన్నట్లు  చెప్పిన నైట్ ఫ్రాంక్.. హైదరాబాద్‌లో మాత్రం 19 శాతం వరకూ ఘోస్ట్ షాపింగ్ సెంటర్లు తగ్గినట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా  లక్ష చదరపు అడుగుల లీజ్ స్పేస్ ఉన్న  చిన్న షాపింగ్ మాల్స్‌లో వేకెన్సీ రేటు 36 శాతంగానే ఉండగా.. 5 లక్షల కంటే ఎక్కువ చదరపు అడుగులు కలిగిన  పెద్ద షాపింగ్ మాల్స్‌లో వేకెన్సీ రేటు 5 శాతమేనని రిపోర్ట్ చెబుతోంది.

ఘోస్ట్ మాల్స్‌ వల్ల  రిటైల్ సెక్టార్‌కు సుమారు 6వేల700 కోట్ల రూపాయల వరకూ నష్టం వచ్చినట్లు నైట్ ఫ్రాంక్ నివేదికలో పేర్కొంది. చిన్న మాల్స్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ప్రాపర్టీ యజమానులకు ఇది సవాలుగా మారినట్లు, ముఖ్యంగా అద్దెకు వచ్చిన వాళ్లను  ఆకర్షించడంలోనూ విఫలం అవుతున్నట్లు తెలిపింది. గ్రేడ్ ఏ మాల్స్ అన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతుండగా.. గ్రేడ్ సీ మాల్స్ మాత్రం ఇలా ఘోస్ట్ సెంటర్లుగా మారుతున్నట్లు గుర్తించినట్లు నివేదికలో తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =