వైఎస్సార్సీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్, పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన

YSRCP Suspends Former Minister Kothapalli Subbarayudu from the Party, YSRCP Party Suspends Former Minister Kothapalli Subbarayudu, Former Minister Kothapalli Subbarayudu, Minister Kothapalli Subbarayudu, EX-Minister Kothapalli Subbarayudu, Kothapalli Subbarayudu, YSRCP suspends Kothapalli Subbarayudu, YSRCP Party gave a twist to former minister Kothapalli Subbarayudu, YSRCP Party suspended ex minister kothapally subbarayudu for anti party elements, anti party elements, EX-Minister Kothapalli Subbarayudu News, EX-Minister Kothapalli Subbarayudu Latest News, EX-Minister Kothapalli Subbarayudu Latest Updates, EX-Minister Kothapalli Subbarayudu Live Updates, Mango News, Mango News Telugu,

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తపల్లి సుబ్బారాయుడును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. “పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు” అని వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.

గత కొంత కాలంగా కొత్తపల్లి సుబ్బారాయుడుకు, పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది. నరసాపురంను జిల్లా కేంద్రం చేయాలనే విషయంలో నరసాపురం సాధనా సమితి ఉద్యమంలో పాల్గొనడం, ఈ విషయంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుపై విమర్శలు చేయడం, అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నరసాపురం నుంచి పోటీచేస్తానని తాజాగా కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఆగ్రహానికి కారణమయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొత్తపల్లి సుబ్బారాయుడుపై సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =