ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్‌

Andhra Pradesh, Andhra Pradesh State Election Commission, AP Coronavirus, AP High Court, AP MPTC, AP MPTC Elections, ap mptc zptc elections, AP MPTC ZPTC Elections 2021, AP ZPTC, AP ZPTC and MPTC Elections, AP ZPTC And MPTC Elections Live Updates, AP ZPTC And MPTC Elections Polling, AP ZPTC Elections, Mango News, MPTC and ZPTC Elections, MPTC Elections Polling Underway in Andhra Pradesh, MPTC ZPTC Elections, MPTC ZPTC Elections Polling, YS Jagan Mohan Reddy, ZPTC, ZPTC and MPTC elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్‌ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం వివరాలు (ఉదయం 11 గంటల వరకు):

  • కర్నూలు – 25.96 శాతం
  • విజయనగరం – 25.68 శాతం
  • తూర్పుగోదావరి – 25 శాతం
  • చిత్తూరు – 24.52 శాతం
  • విశాఖపట్నం – 24.14 శాతం
  • పశ్చిమగోదావరి – 23.40 శాతం
  • అనంతపురం – 22.88 శాతం
  • నెల్లూరు – 20.59 శాతం
  • వైఎస్ఆర్ కడప – 19.72 శాతం
  • శ్రీకాకుళం – 19.32 శాతం
  • కృష్ణా – 19.29 శాతం
  • గుంటూరు – 15.85 శాతం
  • ప్రకాశం – 15.05 శాతం

 

–> ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 515 జెడ్పీటీసీ స్థానాల్లో మరియు 7220 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం 27,751 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. వీటిల్లో 6314 అత్యంత సమస్యాత్మక, 6492 సమస్యాత్మక, 247 పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

–> జెడ్పీటీసీ స్థానాల్లో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ స్థానాల్లో 18,782 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పోలింగ్‌లో మొత్తం 2,46,71,002 మంది ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఏప్రిల్ 9న నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =