మెగాస్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్?

Aishwarya Rai To Pair Up With Chiranjeevi in Koratala Movie?,Mango News,2019 Latest Telugu Movie News, Aishwarya Rai Bachchan roped in for Chiranjeevi next, Aishwarya Rai Movie updates, Chiranjeevi And Aishwarya Rai To Team Up For The Very First, Chiranjeevi Next Movie with Aishwarya Rai, Chiranjeevi to Pair up with Aishwarya Rai, Megastar Chiranjeevi Latest Movie News, Telugu Film Updates,Tollywood Cinema Latest News

సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని త్వరలో షూటింగ్ కి సిద్దమవుతుంది. నటీనటుల ఎంపిక, ఇతర అంశాలపై కసరత్తు జరుగుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, ఈ సినిమాలో చిరు సరసన నటిస్తుందనే వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో మెగాస్టార్ పక్కన ప్రముఖ హీరోయిన్ నయనతార నటిస్తుందనే వార్తలు వచ్చాయి, ఇప్పటికే నయనతార చిరంజీవి పక్కన సైరా లాంటి భారీ ప్రాజెక్టులో నటించినందువల్ల, చిత్ర బృందం ఐశ్వర్య రాయ్ ని ఈ సినిమాలో తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి కిది 152 వ చిత్రం, కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవరించనున్నారు, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రభినయం చేయనున్నారు. ఈ సినిమాని 2020 వేసవిలో విడుదల చేయాలనీ చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ సైరా నరసింహారెడ్డి ‘ కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జూలై ఆఖరునుంచి మొదలు పెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here