ఏపీ బడ్జెట్ 2019-20 హైలైట్స్

Mango News, Andhra Pradesh Political News, Andhra Pradesh budget 2019-20 Highlights, Andhra Pradesh Budget Analysis, AP Assembly Highlights Scenes On First Day Budget Sessions 2019, AP Assembly Budget Sessions 2019 Latest News, budget 2019-20 , Highlights from Andhra Pradesh Budget for the financial year 2019-20

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల హామీలే నెరవేర్చడమే లక్ష్యంగా, నవరత్నాలుకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ బడ్జెట్ ను మునిసిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రవేశ పెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యక్తిగత కారణాల వలన బడ్జెట్ ప్రవేశపెట్టలేక పోయారు.

బడ్జెట్ లోని ముఖ్యంశాలు:

  • ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తాం
  • బడ్జెట్ అంచనాను రూ. 2,27,974. 99 కోట్లుగా ప్రకటించారు
  • వ్యవసాయానికి రూ. 28,896 కోట్లతో ప్రత్యేక బడ్జెట్
  • విన్యూ వ్యయాన్ని రూ. 1,80,475.94 కోట్లుగా, మూలా వ్యయాన్ని రూ. 32,293.39 కోట్లు
  • గోదావరి జలాలు శ్రీశైలం కి తీసుకురావడం, రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడం, కృష్ణ ఆయకట్టు స్థిరీకరించడం
  • ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
  • బ్రాహ్మణ సంక్షేమ శాఖకు రూ. 100 కోట్లు కేటాయింపు
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు
  • అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపిస్తాం
  • ఏపీఎస్ ఆర్టీసీ కి 1000 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ. 260 కోట్లు
  • గ్రామ సచివాలయాల కోసం రూ. 700 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ.3000 కోట్లు
  • వైఎస్ఆర్ గృహనిర్మాణ పథకానికి 5 వేల కోట్లు కేటాయింపు
  • ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి రూ. 45 వేల కోట్లు అవసరం
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయింపు
  • ఉచిత విద్యుత్ కు రూ.4525 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు భరోసా కు రూ.8750 కోట్లు
  • అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు
  • ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ రూ.477 కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.2000 కోట్లు
  • ఎస్సిల సంక్షేమానికి రూ.798 కోట్లు
  • సాగునీటి రంగానికి రూ.13,139 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ. 329 కోట్లు
  • విధ్యుత్ రంగానికి రూ.6861 కోట్లు
  • 5 లక్షల లోపు ఆదాయమున్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపు, రూ.1,740 కోట్లు కేటాయింపు
  • 2021 నాటికీ పోలవరం పూర్తి
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు
  • క్రీడలకు రూ. 329 కోట్లు
  • సాంకేతిక విద్యకు రూ.580.29 కోట్లు
  • ఆశ వర్కర్లకు రూ.455.85 కోట్లు
  • మద్యపాన నిషేధం పై విడతలుగా చర్యలు
  • ఎయిడ్స్ బాధితుల పెన్షన్ కోసం రూ.100 కోట్లు
  • వచ్చే ఉగాది నాటికీ 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణి
  • సామాజిక భద్రత, సంక్షేమానికి రూ.2707 కోట్లు
  • ఎస్టీల అభివృద్ధికి రూ.4988 కోట్లు
  • వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రూ.15,061 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు భరోసా పధకం కింద బోర్ల తవ్వకానికి రూ.200 కోట్లు
  • రైతులకు పెట్టుబడి సాయం రూ. 12,500
  • రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8750 కోట్లు
  • వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పధకానికి రూ.1163 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు బీమాకు రూ.100 కోట్లు
  • ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ. 7 లక్షల ఆర్ధిక సాయం
  • రైతుల రాయితీ విత్తనాలకు రూ.200 కోట్లు
  • వ్యవసాయ యాంత్రికరణకు రూ.420 కోట్లు
  • జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ. 90 కోట్లు
  • పశు సంవర్ధన శాఖకు రూ. 1778 కోట్లు
  • పట్టు పరిశ్రమ అభివృధ్ధి కోసం రూ.150 కోట్లు కేటాయింపు
  • పాడి పరిశ్రమ కోసం రూ.1778 కోట్లు
  • గొర్రెలు మరణిస్తే, భీమా కింద ఒక్కోగొర్రెకి రూ. 6 వేలు
  • పశువు మరణిస్తే భీమా కింద రూ. 30 వేలు
  • పశు గ్రాసం కోసం రూ.100 కోట్లు
  • పశువుల టీకాల కోసం 25 కోట్లు కేటాయింపు

[subscribe]

[youtube_video videoid=44DuTmHWAXc]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − thirteen =