భారీబడ్జెట్ తో 3D లో రామాయణం

Allu Aravind Set To Make A Mythological Epic, Allu Aravind To Produce 3D Ramayana In The Direction of Nitesh Tiwari And Ravi Udyawar, Latest Telugu Movies News, Mango News, Movie Being Made On Ramayana In Rs 500 Crore Budget, Ramayana, Ramayana Movie to be Made in 3 Languages, Ramayana Movie Updates, Ramayana Telugu Movie Latest News, Ramayana to be adapted into big budget action film, Telugu Film News 2019, Tollywood Cinema Updates

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా అనే నిర్మాతలతో కలిసి ఇప్పుడు భారీబడ్జెట్ తో 3D లో రామాయణం సినిమా నిర్మాణానికి స్వీకారం చుట్టారు. గతంలో కూడ తెలుగు చలన చిత్ర సీమలో రామాయణ కథ ఆధారంగా అనేక చిత్రాలు రూపొందించబడి ఘన విజయం సాధించాయి, ఇప్పుడు సరికొత్త విధంగా తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో, 3 పార్టులుగా 3D లో నిర్మించనున్నారు.

ఈ సినిమా సిరీస్ లకు దంగల్ చిత్ర ఫేమ్ నితేశ్ తివారీ, మరియు మామ్ సినిమా దర్శకుడు రవి ఉద్యావర్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ రామాయణ చిత్ర తోలి భాగం 2021 లో విడుదల అయ్యే అవకాశం ఉంది. తెలుగు, తమిళ్ మరియు హిందీ చిత్రసీమకి సంబంధించిన నటీనటులు ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. గతంలో తెలుగులో నందమూరి తారక రామారావు, శోభన్ బాబు, బాలకృష్ణ రాముడు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు, ఈ సినిమాలో రాముడు పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ 2.o తరువాత, ఇండియా లో పూర్తీ స్థాయిలో 3D లో నిర్మించబోయే సినిమా ఇదే అవ్వడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here