అనంతపురం జిల్లాలో టిడిపి కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు

Chandrababu Naidu Tour In Anantapur District,Mango News,Chandrababu Naidu to visit Anantapur district today,Chandrababu Naidu to visit Anantapur to build cadre confidence,Chandrababu Naidu Latest News,Live from the public meeting in Anantapur,TDP Chief Chandrababu Naidu to tour Anantapur

టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీ ఘోరపరాజయం తరువాత, వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి అని, వైసీపీ ప్రభుత్వం చూసిచూడనట్టు వ్యహరిస్తుందని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కూడా దాడులు జరిగాయి. చంద్రబాబు ఈ పర్యటన సందర్భంగా, వైఎస్‌ఆర్‌సిపి నేతల దాడుల్లో గాయపడిన టిడిపి కార్యకర్తలను పరామర్శించి మరియు వారికి తన మద్దతును అందించనున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కడప విమానాశ్రయానికి చేరుకొని,అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా అనంతపురానికి చేరుకుంటారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి కార్యకర్తలపై అనాగరికమైన పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని, ఇటీవలే ప్రకాశం జిల్లాలో జరిగిన పర్యటనలో చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు కొనసాగితే పార్టీ మౌనంగా ఉండదని ఆయన అన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనంతపురం నాయకులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here