బిగ్ బాస్-3: శివజ్యోతి ఎలిమినేట్, ఫైనల్ కి చేరిన ఐదుగురు

Bigg Boss Season 3 Telugu Updates, Bigg Boss Telugu 3 Updates, Bigg Boss Telugu 3 Updates Sivajyothi Eliminated From The Show, Bigg Boss Telugu Season 3 Updates, Bigg Boss Telugu Season 3 Weekend Episode, Bigg Boss Telugu Season 3 Weekend Episode Highlights, Highlights Of Bigg Boss Telugu Season 3, Mango News Telugu, Sivajyothi Eliminated From The Show, Sivajyothi Gets Eliminated, Sivajyothi Gets Eliminated From Bigg Boss Telugu 3

జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ విజయవంతంగా 99 రోజులు పూర్తి చేసుకుని, ఫైనల్ దశకు చేరుకుంది. అక్టోబర్ 27, ఆదివారం నాడు జరిగిన 99వ ఎపిసోడ్ లో యాంకర్ శివజ్యోతి ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతి నామినేట్ అవ్వగా, శనివారం ఎపిసోడ్లో శ్రీముఖీ, బాబా భాస్కర్ సేఫ్ అయి ఫైనల్ కు చేరుకున్నారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లోనే మిగిలిన వరుణ్ సందేశ్, శివజ్యోతి, అలీ రేజాలలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు పొందినా శివజ్యోతి ఎలిమినేట్ అయినట్టుగా వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. శివజ్యోతి ఎలిమినేషన్ సమయంలో మిగతా సభ్యులు ఎమోషన్‌కు గురయ్యారు, శ్రీముఖి శివజ్యోతిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు శివజ్యోతి బాబా భాస్కర్ కాళ్లకు నమస్కారం చేసింది. ఇక రాహుల్, వరుణ్ సందేశ్, అలీ రేజా, బాబా భాస్కర్, శ్రీముఖి ఫైనల్లో పోటీపడబోతున్నారు. ఆదివారం రాత్రి నుంచే ఫైనల్ కు ఓటింగ్ మొదలైంది. ఫైనల్లో విజేతగా నిలిచిన ఇంటి సభ్యుడు రూ.50 లక్షలు గెలుచుకుంటారు.

ఆదివారం నాటి ఎపిసోడ్లో కింగ్ అక్కినేని నాగార్జున తో పాటు, హీరో విజయ్‌ దేవరకొండ కూడ బిగ్ బాస్ షోలో సందడి చేసారు. తను నిర్మాతగా వ్యవరించగా, త్వరలో విడుదలకు సిద్దమైన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్ర బృందంతో కలిసి షో లో పాల్గొన్నారు. సినిమా ట్రైలర్ ను మరోసారి ఈ షో లో లాంఛ్ చేసారు. ముందుగా కన్ఫెషన్ రూంలో ఒక్కో ఇంటి సభ్యుడితో విజయ్‌ దేవరకొండ ముచ్చటించారు. అనంతరం స్టేజ్ పైన వరుణ్ సందేశ్ సేవ్ అయినట్టు ప్రకటించాడు. శివజ్యోతి స్టేజ్ పైకి చేరుకొని, ఇంటి సభ్యులతో తన జ్ఞాపకాలను పంచుకుంది. ఫైనల్ దశకు చేరుకున్న ఈ షో లో ఇప్పటికి 99 రోజులు పూర్తయ్యాయి. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, శిల్ఫా చక్రవర్తి, హిమజ , రవికృష్ణ, పునర్నవి. మహేష్ విట్టా, వితికా, శివజ్యోతి ఎలిమినేట్ అవ్వడంతో ఫైనల్ కి ఐదుగురు సభ్యులు నిలిచారు. అందరూ బలమైన కంటెస్టెంట్లు కావడంతో ఎవరూ విజేతగా నిలుస్తారనే ఆశక్తి ప్రేక్షకుల్లో నెలకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here