కరోనాపై పోరుకు చిరంజీవి, మహేష్ బాబు చెరో కోటి విరాళం

Chiranjeevi, Chiranjeevi and Mahesh Coronavirus Donations, chiranjeevi coronavirus, chiranjeevi donates for coronavirus, Coronavirus, Coronavirus Crisis, Coronavirus Fight, COVID-19, Mahesh Babu, mahesh babu coronavirus, Mahesh babu Donates, Mahesh babu Donates 1 Cr, Mahesh babu Donates For Coronavirus

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మార్చ్ 26, గురువారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 44 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటం చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి పలువురు ప్రముఖులు సహకారం అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరో కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. “కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ ను తప్పనిసరిగా పాటించాలి. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల వలన తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీతో సహా దేశంలోని రోజువారీ కూలీ కార్మికుల మరియు తక్కువ ఆదాయ వర్గాల జీవితాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్ర కార్మికుల సహాయం నిమిత్తం రూ.1 కోటి విరాళంగా ఇస్తున్నానని” చిరంజీవి ప్రకటించారు. అలాగే కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి  రూ. కోటి విరాళం ఇస్తున్నట్టు మహేష్ బాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా మహేష్ బాబు సూచించారు.

కరోనాపై పోరాటానికి విరాళం ప్రకటించిన తెలుగు సినీ ప్రముఖులు:

 • చిరంజీవి: రూ. 1 కోటి
 • పవన్ కళ్యాణ్: రూ. 2 కోట్లు
 • మహేష్ బాబు: రూ. 1 కోటి 
 • ప్రభాస్: రూ. 1 కోటి                                                                                                     
 • రామ్ చరణ్: రూ. 70లక్షలు
 • నితిన్: రూ. 20 లక్షలు
 • త్రివిక్రమ్: రూ. 20 లక్షలు
 • కొరటాల శివ: రూ. 10 లక్షలు
 • అనిల్ రావిపూడి: రూ. 10 లక్షలు
 • వీవీ వినాయక్: రూ. 5 లక్షలు                                                                                           
 • దిల్ రాజు: రూ. 10 లక్షలు
 • సాయి ధరమ్ తేజ్: రూ. 10 లక్షలు

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =