మెగా ప్రీరిలీజ్ ఉత్సవ్‌కి డేట్ ఫిక్స్

Megastar for Hanuman Movie, Megastar Hanuman Movie, Hanuman, Megastar for Hanuman, Hanuman Mega Prerelease Utsav, Chiranjeevi, Teja Sajja, Amrutha Ayyar, Latest Megastar for Hanuman Movie News, Hanuman Movie Megastar News Update, Latest Hanuman Movie News, Hanuman Movie News update, Hanuman Movie, Mango News, Mango News Telugu
Hanuman,Megastar for Hanuman, Hanuman Mega Prerelease Utsav,Chiranjeevi, Teja Sajja, Amrutha Ayyar,

యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ మూవీ‌పై ఆడియన్స్ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన  టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఆడయన్స్‌లో  క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం  ఎదురు చూస్తున్నారు. జనవరి 12న విడుదలకు సిద్దమవుతున్న హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని  గ్రాండ్ గా నిర్వహించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. జనవరి 7న అంటే ఈ  ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.

ఈ మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్‌కి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించగా చిరు దీనికి ఒప్పుకున్నారట.  తాజాగా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ  చిత్ర యూనిట్  ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో ఈ ఈవెంట్‌కు చిరంజీవి వస్తున్నారని డైరక్టుగా చెప్పకపోయినా.. మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ అని చెబుతూ ఇన్ డైరక్ట్ హింట్ ఇచ్చారు. దీంతో  ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా స్టార్ గెస్ట్ గా రాబోతున్నారంటూ సినీ ఇండస్ట్రీలో  గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు హనుమాన్ సినిమాలో మెగాభిమానులకు మరో సర్ఫ్రైజ్ ఉన్నట్లు ప్రచారం  జరుగుతోంది.  ఈ మూవీలో  మెగస్టార్ కూడా కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. రీసెంట్‌గా రిలీజయిన హనుమాన్ ట్రైలర్ క్లైమాక్స్ షాట్‌లో ఆంజనేయస్వామి కళ్లు తెరిచినట్టు సీన్ ఉంది. అయితే ఆ కళ్లు.. మెగాస్టార్ కళ్లులా ఉన్నాయంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి హనుమంతుడికి పరమ భక్తుడన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే ఈ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం మేకర్స్  చిరంజీవిని అలా కనిపించేటట్లు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హనుమాన్ సినిమాలో  చిరంజీవి నిజంగానే కనిపిస్తారా లేదా అని మెగాభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ మూవీలో తేజ సజ్జకు జతగా అమృత అయ్యర్  నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ గా అమెరికా,  శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, జర్మనీ.. ఇలా చాలా దేశాలలో  మొత్తం 11 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  తేజకు హనుమాన్ మూవీ గట్టి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో మూవీ టీమ్ ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =