ఎన్నో ఆరోగ్యప్రయోజనాలతో రామయ్య ప్రసాదం

Elachi Dana Prasadam in Ayodhya, Dana Prasadam in Ayodhya, Elachi Dana Prasadam, Elachi Dana, Ayodhya Ram Temple, Ayodhya, Elachi Dana as Prasad in Ayodhya, Rama Prasad Health Benefits, Latest Elachi Dana Prasadam News Ayodhya, Elachi Dana Prasadam News Update Ayodhya, Latest Ayodhya News, Ayodhya Newes, Mango News, Mango News Telugu
Elachi Dana,Ayodhya Ram Temple,Ayodhya ,Elachi Dana as prasad in Ayodhya,Rama Prasad health benefits

భారతదేశంలో ఉన్నన్ని దేవాలయాలు వేరే ఏ ఇతర దేశాలలోనూ ఉండవు.  ఇక్కడ కొన్ని కొన్ని దేవాలయాల్లో భక్తులకు ఇచ్చే ప్రసాదానికి ప్రత్యేకత ఉంటుంది. తిరుపతి, షిర్డి వంటి కొన్ని దేవాలయాలలో ప్రతిరోజు  వేలమంది  భక్తులకు  ఆహారాన్ని వండి వడ్డిస్తుంటారు. అయితే జనవరి 22 న అయోధ్యలో కొలువు తీరనున్న శ్రీరాముని ఆలయంలో ఏ ప్రసాదం అందించబోతున్నారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతుంది.

భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో లభించే ప్రసాదాలుకి ఎంతో ప్రత్యేకత  ఉంటుంది. అలాంటి వాటిలో ముందుగా తిరుపతి లడ్డూ గురించే చెప్పుకుంటారు. తిరుపతి లడ్డూలను తయారు చేయడానికి 1100 మంది పనివారు.. సోలార్ పవర్‌తో నడిచే  నడిచే వంటశాలలో పనిచేస్తుంటారు. తిరుపతి లడ్డూ ప్రసాదం రుచి మరెక్కడా కూడా ఉండదంటే అది అతి శయోక్తి కాదు.

అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామికి నివేదించే ప్రసాదం కూడా ఎంతో ప్రత్యేకం. గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడితో దానిని తయారు చేస్తారు. ఏడాదిలో కోటి 50 లక్షల ప్రసాదం ప్యాకెట్లు భక్తులకు పంచుతారు. అలాగే  సాయిబాబా వెలసిన పుణ్యక్షేత్రం షిర్డీలో దూద్ పేడా ప్రసాదం ప్రత్యేకం.

అంతేకాకుండా కృష్ణ దేవాలయాలలో మఖన్ మిశ్రీ, వైష్ణో దేవి ఆలయంలో డ్రై ఫ్రూట్స్, వారణాసిలోని అన్నపూర్ణ ఆలయంలో భోజనం, గురుద్వారాలో కడ ప్రసాదం వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. మరి ఇలాంటప్పుడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామమందిరంలో రామునికి ఎలాంటి ప్రసాదం నివేదిస్తారనే ప్రశ్న వినిపిస్తోంది.

జనవరి 22 న అయోధ్యలో  రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ  రామ మందిరంలో .. అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి  వచ్చిన భక్తులకు ‘ఇలాచీ దానా’ ప్రసాదంగా ఇవ్వబోతున్నారు. ఈ ప్రసాదాన్ని చక్కెర, యాలకుల మిశ్రమంతో తయారు చేస్తారు. సాధారణంగా ఈ ప్రసాదాన్ని చాలా దేవాలయాల్లో ఇస్తుంటారు.

రామమందిర ప్రారంభోత్సవానికి వస్తున్న రామయ్య భక్తుల కోసం ఇలాచీ దానాను తయారు చేయడానికి రామ్ విలాస్ అండ్ సన్స్‌కు అయోధ్య రామమందిర ట్రస్ట్ ఇప్పటికే భారీ ఆర్డర్ ఇచ్చిందట.ఈ ప్రసాదం వల్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా కడుపుకి ఇది  దివ్య ఔషధంలా పనిచేస్తుందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eight =