పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బ్రో. ఈ సినిమాని తమిళ విలక్షణ నటుడు ఇంకా దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు.ఈ మూవీని తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఒరిజినల్ సినిమా కథలో దర్శకుడు త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేసి బ్రో సినిమాకు అద్భుతమైన స్క్రీన్ ప్లేను అందించారు. ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కింది.
బ్రో మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్‌తో టీజీ విశ్వప్రసాద్ ఇంకా వివేక్ కూచిభోట్ల ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్‌లుగా నటించారు. ఇంకా అలాగే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన శ్లోకం థీమ్ అయితే ప్రేక్షకులని చాలా బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే అన్ని ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూలై 28న చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక మంగళవారం రోజు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించారు నిర్మాతలు.
ఇకపోతే.. బ్రో సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తోంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా కావడంతో ముందుగానే ఈ సినిమా టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్.. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే గంటలో బుక్ మై షో యాప్‌లో ఏకంగా పదివేల టికెట్స్ అమ్ముడయ్యాయి. అసలు ఓపెన్ చేసిన గంటలోనే ఏకంగా పదివేలకు పైగా టికెట్స్ సేల్ కావడంతో నిర్మాణ సంస్థతోపాటు అభిమానులు కూడా చాలా హ్యాపీగా వున్నారు.
అంతేకాకుండా ఓవర్ సీస్‌లో ప్రీమియర్స్ రూపంలో ఏకంగా 6 లక్షల పైగా డాలర్స్ వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఇండియాలో మాత్రం బ్రో సినిమాకు ఎలాంటి ప్రీమియర్ షోలు.. ఇంకా బెనిపిట్ షోలు ఉండవని అలాగే టికెట్స్ రేట్లు పెంపు కూడా ఉండదని గతంలోనే నిర్మాతలు తెలియజేశారు. అందుకే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమా పై ప్రేక్షకులలో చాలా భారీ అంచనాలు వున్నాయి. మరీ ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి రికార్డ్స్ నమోదు చేస్తుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE