యమునా నది ఉగ్రరూపం.. నీటమునిగిన వందల కార్లు

Hundreds of Cars Submerged as Hindon River Overflows Due to Heavy Rains at Noida,Hundreds of Cars Submerged as Hindon River Overflows,Hundreds of Cars Submerged,Hindon River Overflows,River Overflows Due to Heavy Rains at Noida,Mango News,Mango News Telugu,Delhi, Delhi floods, Floods, Hundreds of cars submerged,Yamuna river is fierce,Hindon river overflowing in Noida,Noida rains,Overflowing Hindon river,Cars submerged in deep waters,Flood Like Situation In Noida,Hindon River Flood,Hindon River Overflows Latest News,Hindon River Overflows Latest Updates,Hindon River Overflows Live News

కొద్ది రోజులుగా దేశ మంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో వరదలు పొంగి పొరలుతున్నాయి. ఇక దేశ రాజధాని.. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి, ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. యమునా నది ఉపనది అయిన హిండన్ నది నీటి మట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడాలోని ఓ మైదానంలో 400కు పైగా కార్లు పైకప్పుల వరకు మునిగిపోయాయి.

గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో కార్లు మునిగాయి. ఆ కార్ల పైకప్పులు కేవలం ఒక అంగుళం మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. నీట మునిగిన కారులు కనిపించడానికి కారణం అన్ని కార్లు కూడా దాదాపు తెల్లవే కావడం. ఒకే కలర్ కార్లను యమునమ్మ ముంచేసిందంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనిని చూసినవాళ్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయ్యో ఇన్ని కార్లు మునిగిపోయాయి.. ఓనర్లకు ఎంత నష్టమో అని జాలి చూపిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోతో తెల్లకార్లను హైలెట్ చేస్తున్నవారిపై ..విషాదంలో వినోదం వెతుక్కుంటున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి హిండన్ నది నీటిమట్టం పెరగడంతో.. నదికి సమీపంలోని వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ కూడా ఉన్నాయి. నోయిడా, జాతీయ రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. తర్వాత యమునా నది ప్రమాదకరస్థాయి 205.33 మీటర్ల ఎగువన ప్రవహిస్తోంది.

ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఎలాంటి భారీ వర్షాల హెచ్చరిక లేదని ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, గోవా, కోస్తా కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్‌లో గత 24 గంటల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 1 =