బన్నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ : పుష్ప ప్రీ రీలీజ్ ఈవెంట్ లో రాజమౌళి

Allu Arjun, Allu Arjun Is A Gift To Tollywood, Allu Arjun Pushpa, Allu Arjun Pushpa Movie, Mango News, Mango News Telugu, Mumbai Is Eagerly Waiting For Pushpa, Pushpa Movie Promotions, Pushpa The Rise Movie, Rajamouli, Rajamouli and Koratala Siva heap praise on Allu Arjun, Rajamouli’s advice to Allu Arjun, Rajamouli’s Idea To Allu Arjun About Pushpa Movie Promotions, SS Rajamouli, SS Rajamouli Praised Allu Arjun, SS Rajamouli Praised Allu Arjun Is A Gift, SS Rajamouli Praised Allu Arjun Is A Gift To The Telugu Film Industry, Telugu Film Industry

అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన ఒక గిఫ్ట్ అని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. పుష్ప ప్రీ రీలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజమౌళి సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తనకు ఆత్మీయుడని, ఈ రోజు సుకుమార్ ఇక్కడ లేకపోవటం కొంచెం బాధగా ఉందని అన్నారు. సుకుమార్ సినిమాలు ఎప్పుడూ మంచి విజయం సాధించాలని కోరుకుంటానని తెలిపారు. పుష్ప సినిమా టీజర్ చూసి కళ్ళు చెదిరి పోయాయని అన్నారు రాజమౌళి. అన్నిటికన్నా తనకు బాగా నచ్చింది విజువల్స్ అని, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని, ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా ఉందని కెమరామెన్ ని మెచ్చుకున్నారు. ఫైట్ సీన్స్ సూపర్ గా ఉన్నాయని.. లామ్, లక్ష్మణ్ మాస్టర్స్ మరియు పీటర్ హైన్స్ మాస్టర్ ని ప్రత్యేకంగా అభినందించారు రాజమౌళి.

ఇక పుష్ప హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. బన్నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అని, బన్నీ చాలామందికి ఇన్స్పిరేషన్ అని, అతను తెలుగు ఇండస్ట్రీకి లభించిన ఒక బహుమతి అని కితాబిచ్చారు రాజమౌళి. పుష్ప సినిమా బన్నీ ఒక్కడిదే కాదని, అది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా అని, పుష్ప సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తాను RRR ప్రమోషన్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అందరూ పుష్ప గురించే అడుగుతున్నారని.. కాబట్టి బన్నీ పుష్ప సినిమా ప్రచారాన్ని బాగా చేయాలనీ ఆయన సూచించారు. అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయని విన్నానని, ఇది ఇలాగే కొనసాగి సినిమా విజయవంతం కావాలని ఆకాక్షించారు దర్శక ధీరుడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here