సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్

Mahesh Babu Starrer Sarileru Neekevvaru Teaser Out, Sarileru Neekevvaru Movie New Teaser, Sarileru Neekevvaru Movie Teaser, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Official Teaser, Sarileru Neekevvaru Teaser Out Now, Sarileru Neekevvaru Telugu Movie Latest News, Sarileru Neekevvaru Telugu Movie Latest Teaser, Sarileru Neekevvaru Telugu Movie Teaser, Superstar Mahesh Babu Starrer Sarileru Neekevvaru Movie Teaser, Superstar Mahesh Babu Starrer Sarileru Neekevvaru Movie Teaser released, Tollywood Cinema Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో, జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. బ్లాక్ బస్టర్ మహర్షి తరువాత మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ఇప్పటీకే విడుదల చేసిన పోస్టర్లు, బర్త్ డే టీజర్ అభిమానులని, సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే నవంబర్ 22, శుక్రవారం సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సూపర్ స్టార్ అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ టీజర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. మహేష్ బాబు ఈ చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల మహేష్ నటించిన చిత్రాలకు కొంచెం భిన్నంగా పూర్తీ స్థాయి మాస్ ఎలిమెంట్స్, కామెడీతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తుంది.

మహేష్ బాబు కెరీర్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ 26వ చిత్రం. పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 వంటి చిత్రాలతో విజయాలు అందుకున్న అనీల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని సంవత్సరాల విరామం తరువాత అలనాటి ప్రముఖ కథానాయిక విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, అజయ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర నిర్మాతలగా వ్యవహరిస్తూ గొప్ప నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుగా జనవరి 11, 2020 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 3 =