ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్.. ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్ కోచ్‌గా నియామకం

Kieron Pollard Announces Retirement From IPL But Stays with Mumbai Indians as Batting Coach,Kieron Pollard Announces Retirement,IPL Mumbai Indians,Mumbai Indians Batting Coach Kieron Pollard,Mango News,Mango News Telugu,IPL Mumbai Indians,Mumbai Indians,IPL Latest News And Updates,Kieron Pollard Retirement,Kieron Pollard Retired From Mumbai Indians,Mumbai Indians,Mumbai Indians Batting Coach,Batting Coach Kieron Pollard

వెస్టిండీస్ స్టార్ ప్లేయర్, ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు అతను ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ తరపున 2010లో ప్రారంభమైన అతని ఐపీఎల్‌ కెరీర్ 13 సంవత్సరాల పాటు సాగింది. ఈ క్రమంలో ఐదు ఐపిఎల్ టైటిల్స్ గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ పొలార్డ్ ముంబై ఇండియన్స్‌ జట్టుకి బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. కాగా తన మొత్తం కెరీర్‌లో పొలార్డ్ ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించటం విశేషం. వెస్టిండీస్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన పొల్లార్డ్ అద్భుతమైన హార్డ్ హిట్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక 5 ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు.

ఈ సందర్భంగా కీరన్ పొలార్డ్.. ‘ముంబై ఇండియన్స్ జట్టులో మార్పుల అవసరం ఉందని అర్థం చేసుకున్నాను. ఎక్కువకాలం ముంబైకి ఆడలేకపోతే వేరే ఇతర జట్లకి ఆడాలి. ఒకవేళ ముంబై ఇండియన్స్‌పైనే ఆడాల్సి వస్తే అది నాకు చాలా ఇబ్బంది. అందుకే ఎప్పటికీ ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గానే మిగిలిపోవాలనుకుంటున్నా. ముంబై ఇండియన్స్ టీమ్‌కు గత 13 సీజన్ల నుంచి ఆడడం పట్ల గర్వంగా ఉంది. ఈ ప్రయాణంలో నన్ను ఆదరించిన జట్టు యాజమాన్యం ముకేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలకు నా ధన్యవాదాలు. వారిని మొదటిసారి కలిసినప్పుడు ఆప్యాయంగా జట్టులోకి ఆహ్వానించారు. మనమంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పారు’ అని గుర్తుచేసుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =