కాపుల ఓట్లపైనే మాజీ జేడీ ఆశలు

Former Jd Lakshmi Narayana's Hopes Are On Kapu Votes, Jd Lakshmi Narayana Hopes Kapu Votes, Jd Hopes Kapu Votes, Votes, Parliament, Assembly, Former JD Lakshmi Narayana, Kapu Votes, Vishnukumar Raju, Lakkaraju Rama Rao, Ganta Srinivasa Rao, Lok Sabha Elections, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
votes,Parliament, Assembly, Former JD Lakshmi Narayana,Kapu votes,Vishnukumar Raju, Lakkaraju Rama Rao, Ganta Srinivasa Rao

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ విశాఖపట్నం నార్త్‌ నుంచి జై భారత్‌ నేషనల్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. విశాఖ నార్త్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు.. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా లక్కరాజు రామారావు పోటీలో ఉన్నారు. అయితే మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వొచ్చనే టాక్‌ వినిపిస్తోంది.

తాను విశాఖపట్నం పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తానని లక్ష్మినారాయణ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఈ సారి కూడా పార్లమెంట్‌ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో అసెంబ్లీ వైపు దృష్టి సారించారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియా శీలకంగా ఉండాలనుకుంటున్నానని..దీనికోసం విశాఖ నార్త్‌ అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. అయితే లక్ష్మీ నారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో..అక్కడ కాపు ఓటర్లు అధికంగా ఉండటం, ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ రాజుల సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేయడంతో.. విశాఖపట్నం నార్త్‌ స్థానానికి మారినట్లు చర్చ జరుగుతోంది.

విశాఖ నార్త్ నియోజక వర్గంలో దాదాపు 40 శాతం వరకు కాపులు.. 20 శాతం రాజులు, మరో 25 శాతం వరకు కాళింగలు ఉన్నారు. 2009లో ఈ నియోజక వర్గం ఏర్పడగా అప్పటి నుంచి కూడా ఇక్కడ క్షత్రియులదే హవాగా కొనసాగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే గంటా శ్రీనివాసరావు రాకతో 2019లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. కాపులంతా ఏకమయ్యి గంటాకు పట్టం గట్టారు. దాదాపు 19వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గంటా గెలుపొందారు. అయితే ఈ సారి కూడా కాపు సామాజిక వర్గమే తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబడటానికి లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 20 =