విజయ్ దేవరకొండ ‘ డియర్ కామ్రేడ్ ‘ ట్రైలర్ రివ్యూ

Vijay Deverakonda Dear Comrade Trailer Release,Dear Comrade Movie Trailer Out Now,Mango News,Latest Telugu Movies News 2019,Telugu Film News,Tollywood Cinema Updates,#DearComradeTrailer,Dear Comrade Movie Updates,Dear Comrade Telugu Movie Latest News,Vijay Deverakonda Dear Comrade Trailer,Dear Comrade Telugu Movie Trailer,Dear Comrade Official Trailer,Dear Comrade Theatrical Trailer,Vijay Deverakonda Dear Comrade Trailer Out Now,Vijay Deverakonda Dear Comrade Trailer Review

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, భరత్ కమ్మ దర్శకత్వంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్ర ట్రైలర్ ని మూవీ యూనిట్ గురువారం విడుదల చేసింది, విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో కాలంగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు విడుదలైన ట్రైలర్ అభిమానులను పూర్తిస్థాయిలో ఆక్కట్టుకునేలా ఉంది. ప్రేమ, బ్రేక్అప్, కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో జరిగే ఈ చిత్ర కధ అభిమానుల్లో ఉత్సుకతను రేకెత్తించేలా ఉంది. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ మళ్ళీ దూకుడు పాత్రలో నటించినట్టుగా తెలుస్తోంది.

ట్రైలర్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు, ఇప్పటికే కొన్ని పాటలు విడుదలై మంచి స్పందన పొందాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మంచి ప్రొడక్షన్ విలువలతో రూపొందిన ఈ చిత్రం జూలై 26 న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో విడుదల కానుంది. దర్శకుడు భరత్ కమ్మ కి ఇదే మొదటి చిత్రం, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసే సందడి తెలుసుకోవాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here