ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప ట్రైలర్ రిలీజ్

Pushpa Trailer,Pushpa Movie Trailer,Pushpa Telugu Movie Trailer,Allu Arjun Pushpa Trailer,Allu Arjun Pushpa Movie Trailer,Pushpa The Rise Trailer,Pushpa The Rise Movie Trailer,Pushpa The Rise Telugu Movie Trailer,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Allu Arjun Pushpa The Rise Trailer,Allu Arjun Pushpa The Rise,Pushpa Official Trailer,Pushpa Theatrical Trailer,Pushpa Telugu Trailer,Pushpa The Rise Telugu Trailer,Pushpa The Rise Trailer Telugu,Pushpa Movie Official Telugu Trailer,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Director Sukumar,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Icon Staar Allu Arjun,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Devi Sri Prasad,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Teaser,Pushpa Movie Teaser,Allu Arjun New Movie Trailer,Pushpa Trailer Day,#PushpaTrailer,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise,#ThaggedheLe

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తుండటం విశేషం. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు చెప్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ గా దీన్ని చెప్తున్నారు. భారీ హంగులతో, భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలలో బన్నీ లుక్ బాగా ఆకట్టుకుంటోంది. బన్నీ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. సునీల్, అనసూయ డిఫరెంట్ పాత్రలలో కనిపించనున్నారు. హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో నటిస్తుండటం విశేషం.

కొన్ని రోజుల క్రితం విడుదల అయిన పుష్ప టీజర్ బాగా ఆకట్టుకుంది. సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ అయింది. సినిమాలో ఉన్న అన్ని కేరక్టర్స్ ని బ్లింకింగ్ స్టైల్ లో ప్రజెంట్ చేసి తన మార్కు చూపించాడు సుకుమార్. సుకుమార్ టేకింగ్, బన్నీ మాస్ లుక్ అండ్ యాక్షన్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచుతున్నాయి. 2018 లో విడుదల అయిన రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావటం గమనార్హం. కరోనా కారణం గా చాలా రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, ఈ నెల 17న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాపై అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here