ఇండియా vs న్యూజిలాండ్ రెండవ టెస్టు మ్యాచ్ హైలైట్స్

India vs Newzealand Second Test Match Sets Multiple Records, #INDvNZ, bcci, cricket, Cricket Live, IND vs NZ, IND vs NZ 2021, India And New Zealand 2nd Test In Mumbai, india cricket, India Team Update, India vs New Zealand, India vs New Zealand 2nd Test, India Vs New Zealand 2nd Test 2021, India vs New Zealand 2nd Test Match, India vs New Zealand 2nd Test Match Updates, India Vs New Zealand 2nd Test Team Updates, India Vs New Zealand 2nd Test Toss, India Vs New Zealand 2nd Test Updates, India vs New Zealand 2nd Test: India Win by 372 runs, India vs New Zealand Cricket, india vs new zealand live, India Vs New Zealand Live Cricket, India Vs New Zealand Live Updates, India Vs New Zealand Updates, India vs NZ, India Vs NZ 2nd Test Match, INDIA Vs NZ Live, India Win by 372 runs, Live Cricket, Mango News, Mango News Telugu, Test Cricket, Test Cricket Match

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ ఎన్నో రికార్డులకు వేదికయింది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ 1-0 తేడాతో మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. 4వ రోజు ఆట ఆరంభమైన కేవలం గంట లోపే మ్యాచ్ ను ముగించింది భారత జట్టు. కాగా, ఈ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం పదండి..

ఈ టెస్ట్ విజయంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది ఇండియా. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి ఇండియా మొదటి స్థానంలోకి వచ్చింది. సోమవారం ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ లో ఇండియా 124 పాయింట్లు సాధించింది. 121 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానానికి పడిపోయింది. ఇండియా ఎక్కువ పరుగుల తేడాతో గెలుపొందిన మ్యాచుల్లో ఈ టెస్టుదే మొదటి స్థానం. 372 పరుగుల భారీ తేడాతో గెలవటం విశేషం. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్ గా మరో రికార్డు సాధించాడు. కెప్టెన్ గా కోహ్లీ కి ఇది 50వ టెస్ట్ విజయం. 3 ఫార్మాట్ల లోనూ 50 అంతర్జాతీయ మ్యాచ్ లు నెగ్గిన తొలి ఆటగాడిగానూ మరో రికార్డు సాధించాడు. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే, స్పిన్ బౌలర్ ఎజాజ్ పటేల్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 10 వికెట్లూ తీసి ప్రపంచ రికార్డుని సాధించాడు. ఇలా ఎన్నో రికార్డులకు వేదిక అయింది ఈ మ్యాచ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =