ప్రధాని మోదీకి తొలి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుతో సత్కారం.. ఏప్రిల్ 24న ప్రదానోత్సవం

PM Narendra Modi To Receive Inaugural Lata Deenanath Mangeshkar Award on April 24, Narendra Modi To Receive Inaugural Lata Deenanath Mangeshkar Award on April 24, Modi To Receive Inaugural Lata Deenanath Mangeshkar Award on April 24, Inaugural Lata Deenanath Mangeshkar Award, Lata Deenanath Mangeshkar Award, PM Modi will be honoured with the inaugural Lata Deenanath Mangeshkar Award on April 24, PM Narendra Modi to receive first Lata Deenanath Mangeshkar Award, Prime Minister Narendra Modi will be honoured with the inaugural Lata Deenanath Mangeshkar Award, PM Narendra Modi to obtain Inaugural Lata Deenanath Mangeshkar Award on April 24, Inaugural Lata Deenanath Mangeshkar Award News, Inaugural Lata Deenanath Mangeshkar Award Latest News, Inaugural Lata Deenanath Mangeshkar Award Latest Updates, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, PM Modi, Prime Minister Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రారంభోత్సవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం సోమవారం ప్రకటించింది. సింగింగ్ లెజెండ్ లతా మంగేష్కర్ తండ్రి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 80వ వర్ధంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 24న ‘లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కార్’ అవార్డును ప్రధాని అందుకోనున్నారు. ఫిబ్రవరిలో మరణించిన లతా మంగేష్కర్ గౌరవార్థం మరియు జ్ఞాపకార్థం ఈ సంవత్సరం నుండి ఈ అవార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు కుటుంబం మరియు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా మంగేష్కర్ కి తుది నివాళులు అర్పించేందుకు ప్రధాని మోదీ ముంబైలో ఆమె అంత్యక్రియలకు సైతం హాజరైన విషయం తెలిసిందే. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డులు సంగీతం, నాటకం, కళ, వైద్యం మరియు సామాజిక సేవ రంగానికి చెందిన దిగ్గజాలను గౌరవించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఏప్రిల్ 24న తొలి అవార్డును అందించనున్నారు. “మొదటి అవార్డు గ్రహీత మరెవరో కాదు, గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము మరియు గర్వపడుతున్నాం” అని మంగేష్కర్ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డుల వేడుకలో ప్రధాని మోదీని ఈ అవార్డుతో సత్కరించనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలను గౌరవించేందుకు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ అవార్డులను ఏర్పాటు చేశామని లతా తోబుట్టువులు హృదయనాథ్ మంగేష్కర్ మరియు ఉషా మంగేష్కర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ‘లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం’ ప్రతి సంవత్సరం దేశానికి, ప్రజలకు, మరియు సమాజానికి మార్గనిర్దేశం చేసిన, అద్భుతమైన మరియు ఆదర్శప్రాయమైన కృషి చేసిన ఒక వ్యక్తికి ఇవ్వబడుతుందని ట్రస్ట్ తెలిపింది. అలాగే ప్రముఖ నటీనటులు ఆశా పరేఖ్ మరియు జాకీ ష్రాఫ్ “సినిమా రంగంలో తమ అంకితభావ సేవలకు” మాస్టర్ దీనానాథ్ ప్రత్యేక పురస్కారాన్ని అందుకోనున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. ఇక భారతీయ సంగీతానికి గానూ, రాహుల్ దేశ్‌పాండే మాస్టర్ దీనానాథ్ పురస్కారాన్ని అందుకోగా, ఉత్తమ నాటక పురస్కారానికి “సంజయ్ ఛాయా” నాటకం ఎంపికయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =