53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా: ప్రదర్శనకై ఆర్ఆర్ఆర్, అఖండ, సినిమాబండి ఎంపిక

53rd IFFI Indian Panorama Announces Official Selection RRR Akhanda Cinema Bandi To be Showcased, Mahananda - Bengali, Three of Us - Hindi,The Story Teller - Hindi,Major – Hindi,Siya - Hindi,Dhabari Kuruvi - Irula,Hadinelentu - Kannada,Nanu Kusuma - Kannada,Lotus Blooms - Maithili,Ariyippu - Malayalam,Saudi Vellakka - Malayalam,Frame - Marathi,Sher Shivraj - Marathi,Ekda Kaya Jala - Marathi,Pratikshya - Oriya,Kurangu Pedal - Tamil,Kida - Tamil,Jai Bheem - Tamil,Movie Bandi - Telugu,Kudhiram Bose - Telugu,Kashmir Files - Hindi,RRR (Raudram Ranam Rudhiram) - Telugu,Tonic - Bengali,Akhanda - Telugu,Dharmaveer Mukkam Post Thane - Marathi

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) యొక్క ఫ్లాగ్‌షిప్ కాంపోనెంట్ అయిన ఇండియన్ పనోరమా శనివారం 25 ఫీచర్ ఫిల్మ్‌లు మరియు 20 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లను ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన చిత్రాలు 2022, నవంబర్ 20 నుండి నవంబర్ 28 వరకు గోవాలో జరిగే 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడనున్నాయి. ఇండియన్ పనోరమా నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతుంది. సినిమాటిక్, నేపథ్య మరియు సౌందర్య శ్రేష్ఠత కలిగిన ఫీచర్ మరియు నాన్ ఫీచర్ ఫిల్మ్‌లను ఎంపికచేయడమే ఇండియన్ పనోరమా లక్ష్యమని పేర్కొన్నారు.

కాగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి నాన్ ఫీచర్ ఫిల్మ్‌ విభాగంలో ఆర్ఆర్ఆర్, అఖండ, సినిమాబండి, కుధిరమ్ బోస్ చిత్రాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అలాగే హిందీ నుంచి మేజర్ చిత్రం కూడా ఎంపిక అయింది. ఇక ఇండియన్ పనోరమా 2022 ప్రారంభ చలనచిత్రం కోసం పృథ్వీ కోననూర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘హడినెలెంటు’ (కన్నడ) చిత్రాన్ని ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ ఎంపిక చేసింది. అలాగే ఇండియన్ పనోరమా, 2022 ప్రారంభ నాన్-ఫీచర్ ఫిల్మ్ కోసం దివ్య కోవాస్జీ దర్శకత్వం వహించిన ‘ది షో మస్ట్ గో ఆన్’ (ఇంగ్లీష్) అనే చిత్రాన్ని జ్యూరీ ఎంపిక చేసింది.

ఫీచర్ ఫిల్మ్‌లు (25):

  1. మహానంద – బెంగాలీ
  2. త్రీ ఆఫ్ అస్ – హిందీ
  3. ది స్టోరీ టెల్లర్ – హిందీ
  4. మేజర్ – హిందీ
  5. సియా – హిందీ
  6. ధబరి కురువి – ఇరుల
  7. హదినెలెంటు – కన్నడ
  8. నాను కుసుమ – కన్నడ
  9. లోటస్ బ్లూమ్స్ – మైథిలి
  10. అరియిప్పు – మలయాళం
  11. సౌదీ వెల్లక్క CC.225/2009 – మలయాళం
  12. ఫ్రేమ్ – మరాఠీ
  13. షేర్ శివరాజ్ – మరాఠీ
  14. ఎక్దా కాయ జలా – మరాఠీ
  15. ప్రతీక్ష్య – ఒరియా
  16. కురంగు పెడల్ – తమిళం
  17. కిడా – తమిళం
  18. జై భీమ్ – తమిళం
  19. సినిమా బండి – తెలుగు
  20. కుధిరమ్ బోస్ – తెలుగు

మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్:

21. కాశ్మీర్ ఫైల్స్ – హిందీ
22. ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) – తెలుగు
23. టానిక్ – బెంగాలీ
24. అఖండ – తెలుగు
25. ధర్మవీర్…ముక్కం పోస్ట్ థానే – మరాఠీ

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =