శ్రీలంకలో ముదిరిన ఆర్ధిక సంక్షోభం.. అధ్య‌క్షుడు రాజ‌ప‌క్సే ఇంటిని చుట్టుముట్టిన వేలమంది నిర‌స‌న‌కారులు

Sri Lanka Economic Crisis Thousands of Protesters Demand For President’s Resignation, Thousands of Protesters Demand For President’s Resignation, Thousands of Protesters Demand For Sri Lanka President’s Resignation, Sri Lanka Economic Crisis, Economic Crisis In Sri Lanka, Sri Lanka Lifts Imposed Curfew Amid People's Protest, Sri Lanka Lifts Imposed Curfew, Imposed Curfew, Sri Lanka Curfew, Curfew In Sri Lanka, Sri Lanka Government lifted an overnight curfew imposed in several parts of Colombo, Sri Lanka Government lifted an overnight mposed Curfew, Sri Lanka Government, Sri Lanka curfew, Sri Lanka curfew update, Sri Lanka curfew Latest News, Sri Lanka curfew Latest Updates, Mango News, Mango News Telugu,

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీలంక అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూస్తోంది. మారకద్రవ్యం కొరత కారణంగా శ్రీలంక ఇంధన ఎగుమతులకు చెల్లించడానికి విదేశీ కరెన్సీ లేకపోవడంతో దారుణమైన తిరోగమనాన్ని చవిచూస్తోంది. శ్రీలంక రాజధానిలో 2000 మందికి పైగా ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజ‌ప‌క్సే ఇంటి వెలుపల పోలీసులతో ఘర్షణ పడ్డారు. రాష్ట్రపతి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్ ప్రయోగించారు. అధ్యక్షుడు రాజపక్సేతో పాటు రాజపక్స కుటుంబ సభ్యులందరూ పదవీ విరమణ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కొలంబో శివార్లలోని మిరిహానా వద్ద ఉన్న ఆయన వ్యక్తిగత నివాసానికి దారితీసే రోడ్ల వెంబడి నిరసనకారులు ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే రాజపక్సే నివాసానికి వెళ్లే రహదారిలోకి వచ్చిన వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఉపయోగించిన రెండు ఆర్మీ బస్సులపై నిరసనకారులు రాళ్లతో దాడి చేశారు, మరికొన్ని బస్సులకు నిప్పంటించారు.

అధ్యక్షుడు రాజ‌ప‌క్సే అన్నయ్య మహింద ప్రధానమంత్రిగా వ్యవహరిస్తుండగా, అతి పిన్న వయస్కుడైన బాసిల్ ఆర్థిక శాఖను కలిగి ఉన్నారు. పెద్ద సోదరుడు చమల్ వ్యవసాయ శాఖ మంత్రిగా, మేనల్లుడు నామల్ క్రీడల కేబినెట్ పదవిని కలిగి ఉన్నారు. శ్రీలంక అంతటా తీవ్ర ఇంధన కొరత వేధిస్తోంది. పెట్రోల్, డీజిల్‌ దేశవ్యాప్తంగా సరఫరా కావడం లేదు. దీంతో వాహనదారులు తమ కార్లను కిలోమీటర్ల మేర రోడ్లపై వదిలి వేశారు. దేశంలోని మూడింట రెండు వంతుల విమానాల వాటా చమురు కూడా అయిపోయిందని ఇకపై అత్యవసర సేవలు కూడా సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. మరోవైపు విద్యుత్‌ను ఆదా చేసేందుకు శ్రీలంక వీధి దీపాలను ఆపివేస్తోందని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యమైన కార్యాలయాలలో జనరేటర్లకు కూడా డీజిల్ లేనందున విద్యుత్ సంస్థ 13 గంటల విద్యుత్ కోతను అమలు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =