100 ఏళ్లలో ఎదురైన అతిపెద్ద సంక్షోభం, 100 రోజుల్లో పరిష్కరించడం కష్టం – ‘రోజ్‌గార్ మేళా’లో ప్రధాని మోదీ

PM Modi Launches The Recruitment Drive Rozgar Mela and Issues Appointment Letters To 75000 New Appointees, PM Narendra Modi, PM Modi will Launch Rozgar Mela, Rozgar Mela on OCT 22, Appointment Letters to 75000 Appointees, Mango News, Mango News Telugu, Rozgar Mela, Diwali Gift From Pm Modi, Govt To Launch Recruitment Drive, Recruitment Drive For 10 Lakh Personnel, Modi Handed 75000 Appointment Letters, Rozgar Mela Latest News And Updates, Diwali Celebrations

దేశవ్యాప్తంగా 10 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ‘రోజ్‌గార్ మేళా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన కొంతమంది అభ్యర్థులకు ప్రధాని చేతుల మీదుగా వ్యక్తిగతంగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించారు. కాగా మొత్తం 75,000 మంది పలు రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన కొత్త రిక్రూట్‌మెంట్‌లు కేంద్ర ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు మరియు ఇతర విభాగాల్లో చేరనున్నారు. నియమితులైనవారు గ్రూప్ – ఎ, గ్రూప్ – బి (గెజిటెడ్), గ్రూప్ – బి (నాన్ గెజిటెడ్) మరియు గ్రూప్ – సి స్థాయిలలో ప్రభుత్వంలో చేరతారు. కొత్త రిక్రూట్‌మెంట్‌లను నియమించే పోస్టులలో సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ పర్సనల్, సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్‌డిసి, స్టెనో, పిఎ, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, ఎంటిఎస్, తదితర పోస్టులు ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఎంఎస్ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లకు పైగా సహాయం అందించిందని, ఇది 1.5 కోట్లకు పైగా సంక్షోభాన్ని నివారించిందని చెప్పారు. తయారీ మరియు టూరిజం శాఖలు చాలా ఉద్యోగాలను సృష్టిస్తున్నాయని, ఈ రంగాలను విస్తరించడంపై ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తోందని ప్రధాని తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, గత 8 సంవత్సరాలలో పదవ స్థానం నుండి ఐదవ స్థానానికి చేరుకున్నామని అన్నారు. ప్రపంచంలోని అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో పోరాడుతున్నాయని, అయితే భారత్ మాత్రం ఇటువంటి కఠిన సవాళ్ళను అధిమించిందని పేర్కొన్నారు. ఇక కరోనావైరస్ మహమ్మారిని ప్రస్తావిస్తూ.. 100 ఏళ్లలో ఎదురైన అతిపెద్ద సంక్షోభం, 100 రోజుల్లో పరిష్కరించడం కష్టం అని ప్రధాని మోదీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =