యోగా మన జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, నేడు అది ఒక జీవన విధానంగా మారింది: ప్రధాని మోదీ

8th International Day of Yoga PM Modi Participates in a Mass Yoga Demonstration at Mysore, PM Modi Participates in a Mass Yoga Demonstration at Mysore, 8th International Day of Yoga, International Day of Yoga, Mass Yoga Demonstration at Mysore, PM Modi Participates in a Mass Yoga Demonstration, Modi Participates in a Mass Yoga Demonstration, Mysore Mass Yoga Demonstration, Yoga International Day, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Yoga Day Celebrations News, Yoga Day Celebrations Latest News, Yoga Day Celebrations Latest Updates, Yoga Day Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

జూన్ 21, మంగళవారం ఉదయం 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మైసూరులోని మైసూర్ ప్యాలెస్ మైదానంలో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. యోగా దినోత్సవం నాడు ప్రధాన కార్యక్రమమైన ఈ సామూహిక యోగా ప్రదర్శనలో ప్రధాని మోదీతో పాటుగా వేలాది మంది ప్రజలు, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు.

యోగా ఇప్పుడు ప్రపంచ పండుగగా మారింది:

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మైసూరు వంటి భార‌త‌దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాల‌ ద్వారా శ‌తాబ్దాలుగా పెంపొందించిన యోగ శ‌క్తి నేడు ప్ర‌పంచ ఆరోగ్యానికి దిశానిర్దేశం చేస్తున్న‌ద‌న్నారు. నేడు యోగా ప్రపంచ సహకారానికి ప్రాతిపదికగా మారిందని, మానవాళికి ఆరోగ్యవంతమైన జీవితంపై నమ్మకాన్ని కల్పిస్తోందని అన్నారు. యోగా అనేది గృహాల నుండి బయటకు వచ్చి ప్రపంచమంతటా వ్యాపించిందన్నారు. గత రెండేళ్లలో కరోనా మహమ్మారికాలంలో ఇది ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి, సహజమైన మరియు పంచుకున్న మానవ స్పృహ యొక్క చిత్రంగా ఉందన్నారు. “యోగా ఇప్పుడు ప్రపంచ పండుగగా మారింది. యోగా అనేది ఏ ఒక్కరికో కాదు, మొత్తం మానవాళికి సంబంధించినది. అందువల్ల ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్-యోగా ఫర్ హ్యుమానిటీ” అని ప్రధాని అన్నారు. ఈ థీమ్‌ను ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నందుకు ఐక్యరాజ్యసమితికి మరియు అన్ని దేశాలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుంది:

భారతీయ ఋషులు చెప్పిన సందేశాన్ని గుర్తుచేస్తూ, “యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు. యోగా మన సమాజానికి శాంతిని కలిగిస్తుంది. యోగా మన దేశాలకు మరియు ప్రపంచానికి శాంతిని తెస్తుంది, యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుంది” ప్రధాని మోదీ అన్నారు. “ఈ విశ్వం మొత్తం మన స్వంత శరీరం మరియు ఆత్మ నుండి ప్రారంభమవుతుంది. విశ్వం మన నుండి మొదలవుతుంది, మరియు యోగా మనలోని ప్రతిదాని గురించి మనకు స్పృహ కలిగిస్తుంది మరియు అవగాహన యొక్క భావాన్ని పెంపొందిస్తుంది” ప్రధాని అన్నారు.

యోగా మన జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, నేడు అది ఒక జీవన విధానంగా మారింది:

దేశం 75వ స్వాతంత్య్ర సంవత్సరం నేపథ్యంలో అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో భారతదేశం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అందుకే భారతదేశ ఉజ్వల చరిత్రకు సాక్ష్యంగా నిలిచి సాంస్కృతిక శక్తికి కేంద్రంగా నిలిచిన దేశవ్యాప్తంగా 75 దిగ్గజ ప్రదేశాలలో సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగా మనకు జీవితంలో ఒక భాగం మాత్రమే కాదని, నేడు అది ఒక జీవన విధానంగా మారిందని అన్నారు. యోగాను నిర్దిష్ట సమయానికి, ప్రదేశానికి పరిమితం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. “మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా, కొన్ని నిమిషాల ధ్యానం మనకు విశ్రాంతినిస్తుంది మరియు మన ఉత్పాదకతను పెంచుతుంది. కాబట్టి మనం యోగాను అదనపు పనిగా తీసుకోనవసరం లేదు. మనం యోగా గురించి కూడా తెలుసుకోవాలి, యోగాతో జీవించాలి. యోగాను అలవర్చుకోవాలి. మనం యోగాతో జీవించడం ప్రారంభించినప్పుడు, యోగా దినోత్సవం మనకు యోగా చేయడానికే కాకుండా మన ఆరోగ్యం, ఆనందం మరియు శాంతిని జరుపుకోవడానికి ఒక మాధ్యమంగా మారుతుంది.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =