సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు.. పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

Hyderabad Vice President Venkaiah Naidu and Union Minister Kishan Reddy Attends Yoga Day Celebrations at Parade Grounds, Hyderabad Vice President Venkaiah Naidu Attends Yoga Day Celebrations at Parade Grounds, Union Minister Kishan Reddy Attends Yoga Day Celebrations at Parade Grounds, Yoga Day Celebrations at Parade Grounds, Parade Grounds, Yoga Day Celebrations, Hyderabad Vice President Venkaiah Naidu, Vice President Venkaiah Naidu, Hyderabad Vice President, Venkaiah Naidu, Union Minister Kishan Reddy, Minister Kishan Reddy, Kishan Reddy, Yoga Day Celebrations News, Yoga Day Celebrations Latest News, Yoga Day Celebrations Latest Updates, Yoga Day Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు యోగాసనాలు వేసిన అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యోగా ప్రాచీనమైనదని, యోగా అంటే ఇంద్రియాలను ఏకం చేయడం, ఆత్మశక్తిని ఏకం చేయడం అని పేర్కొన్నారు. యోగాకు కులం, మతం వంటి అడ్డుగోడలు లేవని, ప్రస్తుత జనరేషన్ కూడా యోగా చేయటం ఒక అలవాటుగా మార్చుకోవాలని వెంకయ్య కోరారు.

యోగా ద్వారా మనలో యూనిటీ, ఇంటిగ్రిటీ, ఆరోగ్యం పెరుగుతాయని వెంకయ్య నాయుడు తెలిపారు. మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పారని, యోగా సాధనతో స్ట్రెస్, టెన్షన్స్ వంటి వాటిని దూరం చేయొచ్చని తెలిపారు. ఎన్నో శతాబ్దాలుగా యోగా మనదేశ సంప్రదాయంలో భాగమై ఉందని, ఇప్పుడు ప్రధాని మోదీ దానిని ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలలో దీనిపై అవగాహన బాగా పెరిగిందని, ఈరోజు ఇంతమంది ఇక్కడకు వచ్చి ఈ యోగా మహోత్సవ్‌ను విజయవంతం చేయడమే దానికి నిదర్శనం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =