రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్

Actor Kamal Haasan Says I am Here as an Indian, WKamal Haasan Joins Rahul Gandhi's Bharat Jodo Yatra at Delhi Today, Amid Covid Alert, bharat jodo News, Bharat Jodo Yatra, Bharat Jodo Yatra Despite Warning From Union Health Minister, Bharat Jodo Yatra enters Delhi, Bharat Jodo Yatra Latest Updates, Bharat Jodo Yatra Sonia Gandhi and Priyanka Vadra, Congress Party News, INC Bharat Jodo Yatra Enters Delhi, Mango News, Priyanka Vadra, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Yatra, Sonia and Priyanka Join Rahul Gandhi In Bharat Jodo Yatra, Sonia Gandhi, Union Health Minister

ఈరోజు ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ యాత్రలో ప్రముఖు నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇక్కడ ఎందుకు ఉన్నానని చాలా మంది అడుగుతారని, వారందరికీ సమాధానం ఒక్కటేనని, తాను భారతీయుడిగా ఇక్కడ ఉన్నానని తెలిపారు. తన తండ్రి కాంగ్రెస్‌ వాది అని, అయితే తాను వివిధ సిద్ధాంతాలను కలిగి ఉండి, స్వంత రాజకీయ పార్టీని ప్రారంభించానని వెల్లడించారు. కానీ దేశం విషయానికి వస్తే, అన్ని రాజకీయ పార్టీలు ఒకటే విధానాన్ని కలిగి ఉండాలనేదే తన అభిప్రాయమని, దానిని ప్రకటించడానికే ఇక్కడికి వచ్చానని ఎర్రకోటకు వద్ద కమల్ హాసన్ అన్నారు.

కాగా ఇప్పటికే దాదాపు 3,000 కి.మీలు సాగిన కాంగ్రెస్ పాదయాత్ర నేడు ఢిల్లీలోకి ఎంటరైంది. ఈ ఉదయం ఫరీదాబాద్ నుండి బదర్‌పూర్ సరిహద్దు వద్ద రాహుల్ గాంధీ వేలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి దేశ రాజధానిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేతలు జైరామ్ రమేష్, పవన్ ఖేరా, భూపీందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా మరియు రణదీప్ సూర్జేవాలాతో సహా పలువురు పార్టీ నేతలు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా రాహుల్‌ యాత్రలో పాల్గొన్నారు. కాగా సోనియా గాంధీ యాత్రలో పాల్గొనడం ఇది రెండోసారి. తొలిసారి ఆమె అక్టోబ‌ర్‌లో క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో పాదయాత్ర‌ కొనసాగుతున్న సమయంలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 19 =