కొత్త ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్

Telangana Transport Minister Puvvada Ajay Flag Off 50 New TSRTC Super Luxury Buses Today,Telangana Transport Minister Puvvada Ajay, 50 New TSRTC Super Luxury Buses,TSRTC Super Luxury Buses,Mango News,Mango News Telugu,TSRTC Latest News and Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అత్యాధునిక హంగులతో సరికొత్త ఆధునిక సదుపాయాల గల కొత్త సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. శనివారం మధ్యాహ్నం 50 కొత్త టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో తొలివిడతలో భాగంగా 50 సూపర్ లగ్జరీ బస్సులను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచనల మేరకు రూ.392 కోట్లతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను టీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తుందన్నారు. తొలి విడతగా 630 సూపర్‌ లగ్జరీ బస్సులు, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులు అందుబాటులోకి రానుండగా, పూర్తి స్ధాయిలో 2023 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు.

తొలి విడతలో కొనుగోలు చేసిన 776 బస్సుల్లో నేడు 50 బస్సులను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు దృష్టిలో ఉంచుకుని తొలిసారి ట్రాకింగ్ సిస్టం మరియు పానిక్ బటన్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఈ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణా కమిషనర్‌ జ్యోతి బుద్ధాప్రకాశ్‌ తో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =